SBI Customer Alert: ఎస్‌బీఐ వినియోగదారులకు అలెర్ట్.. రెండున్నర గంటలు సేవలకు అంతరాయం
SBI Online Banking Services: ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే
SBI Online Banking Services: ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి అవసరమైన వస్తువులను ఇంటినుంచే పొందుతున్నారు. ఒకవేళ అత్యవసర సమయంలో బయటకు వెళ్లినా.. ఆన్‌లైన్ పద్దతుల్లోనే నగదును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో పలు బ్యాంకులు కూడా తమ సేవలను సులభతరం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కూడా సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎస్‌బీఐ సేవలు రేపు (గురువారం) రెండున్నర గంటలపాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. జూన్ 17 (బుధవారం అర్ధరాత్రి) ఎస్‌బీఐ ప్రత్యేక సేవలు అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల వరకు నిలిచిపోనున్నాయని పేర్కొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ గ్రేడేషన్ మెయింటెనెన్స్ సర్వీసులో భాగంగా ఈ అంతరాయం కలగనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. కస్టమర్ లకు మెరుగైన సేవలను అందించేందుకు ఈ అప్‌గ్రెడేషన్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి.. తాము చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని.. ఖాతాదారులు తమకు సహకరించాలని ఎస్బీఐ కోరింది. ఈ రెండున్నర గంటల వ్యవధిలో చేపట్టే నిర్వహణ కార్యకలాపాల వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్/యుపీఐ సేవలు పనిచేయవని స్పష్టంచేసింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/Nk3crZQ2PG
— State Bank of India (@TheOfficialSBI) June 16, 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతోంది. దీని నెట్ వర్క్ పరిధిలో 22,000 బ్రాంచీలు, 58,500 ఎటిఎమ్‌లు, 66,000 బీసీ అవుట్ లెట్‌ల ద్వారా 44 కోట్ల మంది ఖాతాదారులకు సేవలందిస్తోంది.
Also Read: