Harsh Vardhan: వ్యాక్సిన్ ఉందంటూ.. కరోనా మహమ్మారిని లైట్ తీసుకుంటున్నారు: హర్షవర్ధన్
COVID-19: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం వహిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
COVID-19: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం వహిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తూ.. కోవిడ్ మహమ్మరిని తేలికగా తీసుకుంటున్నారని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్-19 ప్రొటోకాల్ ను విధిగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మనమందరం అప్రమత్తంగా ఉంటూ కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటేనే మహమ్మారి అంతం అవుతుందని డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మనం ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. అందరూ త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ సమసిపోలేదని, అది తన రంగులు మార్చుకుంటోందని ఎయిమ్స్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ నవనీత్ విగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతుందని.. ఆ తర్వతా కూడా ప్రమాదం పొంచి ఉందని ఆయన వెల్లడించారు.
Also Read: