Shocking News: దేశ వ్యాప్తంగా పలు నదులు, సరస్సుల్లో కరోనా వైరస్.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
Shocking News: సరస్సులు, నదుల్లో కరోనా ఆనవాళ్లపై పలు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
Shocking News: సరస్సులు, నదుల్లో కరోనా ఆనవాళ్లపై పలు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశ వ్యాప్తంగా పలు నదులు, సరస్సుల్లో కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు లైఫ్‌లైన్‌గా పిలువడుతున్న సబర్మతి నదిలో కరోనా వైరస్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. నది నుంచి సేకరించిన శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. సబర్మతి నదితో పాటు, అహ్మదాబాద్, కంకరియా, చందోలా సరస్సు సహా ఇతర నీటి వనరుల నుండి తీసిన నమూనాల్లోనూ కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. ఇక అస్సాంలోని గౌహతి ప్రాంతంలోని నదులలో కూడా పరిశోధకలు పరిశోధనలు జరుపగా.. ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. భారు నది నుంచి సేకరించిన నమూనాలను పరిశీక్షించగా.. అందులో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
ఐఐటీ గాంధీ నగర్ సహా దేశంలోని ఎనిమిది సంస్థలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. వీటిలో న్యూఢిల్లీలోని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం, మురుగునీటి నుండి నమూనాలను తీసుకొని పరీక్షలు జరుపగా.. కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సహజ నీటిలోనూ కరోనా ఉండే అవకాశం ఉందా? అని ఆలోచనల నేపథ్యంలో అధ్యయనాలు ప్రారంభించారు. అహ్మదాబాద్, గౌహతి నగరాల్లో అత్యధిక వ్యర్థ జల శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఆ కారణంగా ఈ రెండు నగరాలను ఎంచుకున్న పరిశోధకులు.. ఆ దిశగా ఆ నగరాల్లోని నీటిలో కరోనా లక్షణాలపై పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలో వారు ముందుగా భావించినట్లుగానే కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
Also read:
IND Vs NZ, WTC Final 2021 Day 1 Live: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడు షాక్.. ఫస్ట్ సెషన్ రద్దు..