Prasanna Venkateswara: కోవిడ్ నిబంధనల నడుమ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపు ధ్వజారోహణ
Prasanna Venkateswara: తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది...
Prasanna Venkateswara: తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం చేయనున్నారు అర్చకులు.
రేపు ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణం చేయనున్నారు. దీంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుండి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
Also Read: శ్రీ గోవిందరాజస్వామివారికి కరోనా నిబంధన నడుమ పుష్పయాగం
పిల్లల ఆశలు తీర్చే వెలకట్టలేని త్యాగాల నిధి నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలతో..