Pushpayagam : శ్రీ గోవిందరాజస్వామివారికి కరోనా నిబంధన నడుమ పుష్పయాగం
Pushpayagam : తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా పుష్పయాగం మొదలైంది. ఈ పుష్ప యాగం కోసం అర్చకులు..
Pushpayagam : తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా పుష్పయాగం మొదలైంది. ఈ పుష్ప యాగం కోసం అర్చకులు గురువారం సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవంతో అంకురార్పణ చేశారు. కరోనా నేపథ్యంలో ఈ పుష్పయాగం కోద్దీ మంది సమక్షంలో నివహిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
మే 18 నుండి 26వ తేదీ వరకు వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read: తెరుచుకున్న ఒంటిమిట్ట రామాలయం.. స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..