Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tirupati Tour: తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

IRCTC Tirupati Tour: లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలకు వెళ్లలేకపోతున్న వారికి ఇది గుడ్‌న్యూస్‌. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ఇండియన్ రైల్వే కేటరింగ్..

IRCTC Tirupati Tour: తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం పేరుతో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ
Irctc Tirupati Tour
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2021 | 10:29 AM

IRCTC Tirupati Tour: లాక్‌డౌన్‌ కారణంగా తిరుమలకు వెళ్లలేకపోతున్న వారికి ఇది గుడ్‌న్యూస్‌. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనంతో శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులను హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్‌లో తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు కవర్ అవుతాయి.

అయితే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో కలిపి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్యాకేజీ బుకింగ్‌ చేసుకున్న భక్తులు మొదటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమాన ఎక్కాల్సి ఉంటుంది.ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌లో చెకిన్ కావాలి. మధ్యాహ్న భోజనం తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.

అయితే తిరుమల బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం’ ప్యాకేజీ 2021 జూలై 17, 30, ఆగస్ట్ 14, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.13,900, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,000, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.15,685. ప్యాకేజీలో విమాన టికెట్లు, ఒక రాత్రి హోటల్‌లో బస, ఒక బ్రేక్‌ఫాస్ట్, రెండు లంచ్, ఒక డిన్నర్, ప్రైవేట్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెకౌట్ కావాలి. ఆ తర్వాత తిరుమల తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరుచానూర్ బయలుదేరాలి. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులను తిరుపతి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. తిరుపతిలో సాయంత్రం 6.40 గంటలకు విమానం ఎక్కితే రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇవీ కూడా చదవండి:

అయోధ్యలో భారీ భూకుంభకోణంపై విచారణ జరపాలన్న కాంగ్రెస్,…కొట్టి పారేసిన శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా..? లింక్ ద్వారా మార్చండి