అయోధ్యలో భారీ భూకుంభకోణంపై విచారణ జరపాలన్న కాంగ్రెస్,…కొట్టి పారేసిన శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్యలో జరిగిన భారీ భూకుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ పార్టీ నేత పీ.సి. శర్మ ఈమేరకు భోపాల్ లో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ...

అయోధ్యలో భారీ భూకుంభకోణంపై విచారణ జరపాలన్న కాంగ్రెస్,...కొట్టి పారేసిన శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Ayodhya
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 17, 2021 | 9:35 PM

అయోధ్యలో జరిగిన భారీ భూకుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ పార్టీ నేత పీ.సి. శర్మ ఈమేరకు భోపాల్ లో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అయోధ్యలో శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ లావాదేవీల్లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇది సుమారు రూ. 1200 కోట్ల స్కామ్ అని నిర్మోహి అఖారా సంత్ ఒకరు పేర్కొన్నారని, అలాగే హనుమాన్ గర్హి, రామ్ లాలా ఆలయాల పూజారులు కూడా డిమాండ్ చేశారని ఆయన చెప్పారు. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ కూడా ఈ భూముల లావాదేవీలకు సంబంధించి ట్రస్ట్ ఖర్చు చేసిన వివరాలు తెలపాలని కోరారని ఆయన గుర్తు చేశారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తో బాటు దీనితో సంబంధం ఉన్న వారందరిపై 408, 420, 120 బీ సెక్షన్ల కింద కేసు పెట్టాలని ఆయన అన్నారు. ఆప్, సమాజ్ వాదీ పార్టీ కూడా ఇటీవలే ఈ విధమైన ఆరోపణలు చేశాయి. ఆప్ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి పవన్ పాండే ..దీనిపై సీబీఐ, ఈడీ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలన్నారు. రూ. 2 కోట్ల విలువైన భూమిని రూ. 18.5 కోట్లకు ఎలా కొనుగోలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేవలం 5 నిమిషాల్లో అవినీతి జరిగిందని వారు ఆరోపించారు.

అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కొట్టిపారేశారు. వాస్తవాలను తాము ఇదివరకే స్పష్టం చేశామని, రామ భక్తుల్లో అయోమయం సృష్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏ సంస్థతో నైనా దర్యాప్తు జరిపించుకోవచ్చునని ఆయన సవాల్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Old Age Healthy habits: వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించడానికి అత్యుత్తమ ఆరు అలవాట్లు.. అవేమిటంటే..

Attack: బిర్యానీ బాగా లేదన్నందుకు.. యువకులపై దాడి.. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌పై కేసు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu