కోవిద్ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్రీ మొబైల్ రీఛార్జ్….మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ‘తాయిలం’
కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఉచితంగా మొబైల్ రీఛార్జ్ చేయిస్తానని మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు.

కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఉచితంగా మొబైల్ రీఛార్జ్ చేయిస్తానని మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారు. బెగుసరాయ్ లోని తన బెరాసియా అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామీణులు ఇప్పటికీ టీకామందు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని విష్ణు ఖత్రి అనే ఈ ఎమ్మెల్యే అన్నారు. ఈ నెల 30 లోగా గ్రామీణులంతా వ్యాక్సిన్ తీసుకుంటే వారికీ ఫ్రీ మొబైల్ రీఛార్జ్ అన్నారాయన.. పైగా నా నియోజకవర్గంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఏ గ్రామ పంచాయతీకైనా రూ.20 లక్షల రివార్డు కూడా ఇస్తానని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ అంటే ఇప్పటికీ వీరిలో అనేక సందేహాలు, భయాలు ఉన్నాయని, వాటిని పోగొట్టవలసి ఉందని ఖత్రి పేర్కొన్నారు. డిసెంబరు కల్లా దేశ జనాభాకంతటికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల టీకామందు ఇవ్వడానికి వెళ్లిన హెల్త్ కేర్ బృందాలపై దాడులు జరుగుతున్నాయని, వారికీ పోలీసు రక్షణ కల్పించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇటీవల తమ రాష్ట్రంలో జరిగిన ఈ విద్జమైన ఉదంతాలను ఆయన ప్రస్తావించారు.
కాగా హోషంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.. సీతా శరణ్ శర్మ.కూడా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న పంచాయతీకి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని అన్నారు. తన నియోజకవర్గంలో 43 గ్రామాలు ఉన్నాయని అయన వెల్లడించారు. కనీసం తన రివార్డు నేపథ్యంలో అయినా పల్లె ప్రజలు టీకామందు తీసుకోవడానికి ముందుకు వస్తారనిఆశిస్తున్నానని అయన చెప్పారు. దేశంలో ఇంకా అనేక గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందన్న వార్తలు వినవస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: అయోధ్యలో భారీ భూకుంభకోణంపై విచారణ జరపాలన్న కాంగ్రెస్,…కొట్టి పారేసిన శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్