జమ్మూ కాశ్మీర్ లో జవాన్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బాంగ్రా డ్యాన్స్ …. నెట్ లో మిశ్రమ స్పందనలు

జమ్మూ కాశ్మీర్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం సందడి చేశాడు, బందిపోరా జిల్లాలో ఆయన బీ ఎస్ ఎఫ్ జవాన్లతో కలిసి బాంగ్రా డ్యాన్స్ చేశాడు.

జమ్మూ కాశ్మీర్ లో జవాన్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్   బాంగ్రా డ్యాన్స్ .... నెట్ లో మిశ్రమ  స్పందనలు
Akshay Kumar Bhangra Dance

జమ్మూ కాశ్మీర్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం సందడి చేశాడు, బందిపోరా జిల్లాలో ఆయన బీ ఎస్ ఎఫ్ జవాన్లతో కలిసి బాంగ్రా డ్యాన్స్ చేశాడు. తమ అభిమాన నటుడితో కలిసి తాము కూడా స్టెప్పులు వేయడం జవాన్లకు కూడా సంతోషం కలిగించింది. డ్యాన్స్ అనంతరం అక్షయ్ వారితో సెల్ఫీలు దిగి వారితో తానూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. వారితో తాను దిగిన ఫోటోలను, వీడియోను ఆయన తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. భారత సరిహద్దులను ఎల్లవేళలా రక్షిస్తున్న సోదర జవాన్లతో చిరస్మరణీయమైన రోజును గడిపాను అని పేర్కొన్నాడు. అక్కడికి ఎప్పుడు వెళ్లినా అది ఓ అనిర్వచనీయమైన అనుభూతి అన్నాడు. జవాన్లతో కలిసి అక్షయ్ కుమార్ చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగ్గా మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. కొందరు యూజర్లు ఈ నటుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ నటుడు ఎక్కడికి వెళ్లినా అందరితో అభిమానంగా కలిసిపోతాడని, వారిని సంతోషంలో ముంచెత్తుతాడని కొందరు పేర్కొన్నారు.

అయితే మరికొందరు మాత్రం అక్షయ్ తీరును ఈసడించుకున్నారు. అసలు ఆయనకు మాస్క్ లేదని, భౌతిక దూరం పాటింపు అసలే లేదని విమర్శించారు. నిబంధనలు గాలికి….మాస్కులు గాలికి….అమాయక భారతీయుల డెడ్ బాడీలపై సెలబ్రేషన్ అని వీరు వ్యాఖ్యానించారు.. ఈ కోవిద్ సమయంలో ఈ డ్యాన్సులా అని ఆరోపించారు. కాగా దేశంలో కోవిద్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ న చేసిన ఈ పని సబబే అని కొంతమంది సమర్థించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Google Help: కరోనా కష్టకాలంలో గూగుల్‌ చేయూత.. రూ.113 కోట్ల భారీ విరాళం.. ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్‏న్యూస్.. రేపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్..

Click on your DTH Provider to Add TV9 Telugu