లాక్ డౌన్ అమల్లో ఉన్నా భారీగా పసిడి స్మగ్లింగ్…..మణిపూర్ లో రూ. 21 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ల స్వాధీనం

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో గురువారం 43 కేజీల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Publish Date - 11:02 pm, Thu, 17 June 21 Edited By: Phani CH
లాక్ డౌన్ అమల్లో ఉన్నా భారీగా పసిడి స్మగ్లింగ్.....మణిపూర్ లో రూ. 21 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ల స్వాధీనం
21 Crore Gold Biscuits

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో గురువారం 43 కేజీల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 21 కోట్ల విలువైన వీటిని ఇద్దరు వ్యక్తులు కారులో దాచి తీసుకువెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు వారు చెప్పారు. ఈ కారులోని వివిధ చోట్ల దాచిన ఈ పసిడిని ‘సేకరించడానికి’ తమకు సుమారు 18 గంటలు పట్టిందని అధికారులు తెలిపారు. మొత్తం 260 ఫారిన్ మేడ్ బిస్కెట్లనీ, అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ ఇంకా ఎక్కువే ఉండవచ్చునని వారన్నారు. లోగడ కూడా బంగారం స్మగ్లింగ్ కి ఇదే వాహనాన్ని వినియోగించారని తెలిపారు. మయన్మార్ సరిహద్దులోని మణిపూర్ లో ఇంకా కోవిద్ లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇక్కడ స్వర్ణం స్మగ్లింగ్ నిరాఘాటంగా కొనసాగుతోంది. గత 3 నెలల్లో రూ.33 కోట్ల విలువైన 67 కేజీల బంగారాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని, ఒక్క జూన్ నెలలోనే 55 కేజీల స్వర్ణం పట్టుబడిందని వేరు పేర్కొన్నారు.

ఇండో-మయన్మార్ సరిహద్దుల ద్వారా జరుగుతున్న ఈ దొంగ రవాణాను ఎలా ఆపాలో అధికారులకు అంతు పట్టడంలేదు.. చెక్ పాయింట్లు పెట్టినా స్మగ్లర్లు చాకచక్యంగా బంగారాన్ని స్మగుల్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ నెల 309 వరకు ఇక్కడ లాక్ డౌన్ అమల్లో ఉంది. కోవిద్ కేసుల దృష్ట్యా ఆంక్షలను పొడిగిస్తూ వస్తున్నారు, అయితే కొందరు అవినీతి అదికారుల పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏమైనా నిఘాను మరింత పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Priyamani: ఆయన వల్లే ఫ్యామిలీ మ్యాన్ ఒప్పుకున్నాను.. లేదంటే చేసేదాన్ని కాదేమో.. ( వీడియో )

Manchu Vishnu: ఓటీటీలోకి విడుదల కానున్న ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. ( వీడియో )