Stalin calls on PM Modi : ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. 25 అంశాలతో కూడిన మెమోరాండం సమర్పణ
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ ప్రధానిని మొట్ట మొదటి సారి కలిశారు.
Tamilnadu CM Stalin calls on PM Modi : తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ ప్రధానిని మొట్ట మొదటి సారి హస్తిన వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ ఉదయం ఢిల్లీకి వెళ్లిన స్టాలిన్ సాయంత్రం ప్రధానిని కలిసి శాలువాతో సత్కరించి అనంతరం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానికి విన్నవించారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన 25 ప్రధాన డిమాండ్లతో కూడిన మెమోరాండం ప్రధానికి సమర్పించారు స్టాలిన్. హెచ్‌ఎల్‌ఎల్ బయోటెక్, మదురైలో ఎయిమ్స్ ఏర్పాటు, ఇంకా.. నీట్ మెడికల్ అడ్మిషన్స్ తదితర అంశాలపై ప్రధాని మోదీకి నివేదించారు.
సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడిన స్టాలిన్, ప్రధానితో తన సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తనను ఎప్పుడైనా కలిసి వివరించవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారని స్టాలిన్ తెలిపారు.
స్టాలిన్ సమర్పించిన మెమోరాండంలో చెంగల్పట్టులోని హెచ్‌ఎల్‌ఎల్ బయోటెక్ లిమిటెడ్ నిర్వహణతోపాటు, మదురైలో ఎయిమ్స్ స్థాపన వేగవంతం చేయడం, వైద్య ప్రవేశాల కోసం నీట్‌ను రద్దు చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రధాని ముందుంచారు స్టాలిన్.
Read also : KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ