Digital Eye Strain: ఎక్కువ గంటలు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారా ? కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..

కంప్యూటర్ పై ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీ కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటాయి. ఇటీవల ఓ అధ్యాయనంలో 80 శాతం మంది ప్రజలలో స్క్రీన్ చూసే

Digital Eye Strain: ఎక్కువ గంటలు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారా ? కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..
Digital Eye Strain
Follow us

|

Updated on: Jun 17, 2021 | 9:34 PM

కంప్యూటర్ పై ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీ కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటాయి. ఇటీవల ఓ అధ్యాయనంలో 80 శాతం మంది ప్రజలలో స్క్రీన్ చూసే సమయం పెరిగిందని.. దీంతో వారి కళ్ల పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. దాదాపు పావువంతు మంది ప్రజలు తమ కళ్లు ఒక సంవత్సరం క్రితం కంటే.. ప్రస్తుతం మరింత దారుణంగా మారయని చెప్పారు. అలాగే మరికొందరి కంటి సమస్యలను ఎదుర్కోంటున్నట్లు చెప్పారు. డిజిటల్ డిటాక్స్, కొంతకాలం స్క్రీన్‌ను చూడని చోట, కంటి ఒత్తిడిని తగ్గించే మార్గం. స్క్రీన్ ను దూరంగా చూడటం కాకుండా మీ కళ్ళ నుండి ఉపశమనం పొందటానికి ఇతర మార్గాలు ఉన్నాయి.

డిజిటల్ కంటి ఒత్తిడికి కారణం.. స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడడం వలన డిజిటల్ కంటి ఒత్తిడి సంభవిస్తుంది. ఇది స్ర్కీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వలన కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

లక్షణాలు.. కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు చూపు సరిగ్గా ఉండకపోవడం..తలనొప్పి, పొడి, గొంతు సమస్య, కళ్ల నుంచి నీరు రావడం జరుగుతుంది. అయితే కొందరికి కంటి చూపు సరిగ్గా ఉన్నాకానీ.. ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వలన కళ్లు అలసిపోతుంటాయి. బ్లూలైట్ ప్రభావాన్ని తగ్గించడం.. కంప్యూటర్ లెన్స్, బ్లూ లైట్ తగ్గించడం, యాంటీ రిఫ్లెక్టివ్ లెన్స్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కళ్లపై బ్లూలైట్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఒక వేళ మీరు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉపయోగించకపోతే.. బ్లూలైట్ తగ్గించే గ్లాసెస్ వాడడం మంచిది. అలాగే యాంటీ రిఫ్లెక్టివ్ లెన్స్ ఉపయోగించడం మంచిది.

ఒత్తిడిని త్గగించడానికి 20-20-20 నియమం.. 20-20-20 అంటే.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువు కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయవడం వలన ఈ దృష్టిని రీసెట్ అవతుంది. అలాగే కళ్లపై ఒత్తిడి ఉండదు. అలాగే కళ్లకు ప్రతిసారి రెప్ప వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కళ్లు పొడిబారకుండా ఉంటాయి. అలాగే కళ్లు ఎక్కువ సేపు తెరచి ఉండడం వలన పొడిబారడం.. కంటి ఒత్తిడి పెరుగుతుంది.

Also Read: India Coast Guard rescues: ‘ఎయిర్-సీ’ సమన్వయ ఆపరేషన్ సక్సెస్.. మునిగిపోతున్న ఓడ నుంచి 16 మంది రక్షించిన కోస్టల్ గార్డ్స్