Attack: బిర్యానీ బాగా లేదన్నందుకు.. యువకులపై దాడి.. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌పై కేసు
Attack on Customers: హైదరాబాద్ బిర్యానీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ, విదేశాల్లో హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ
Attack on Customers: హైదరాబాద్ బిర్యానీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ, విదేశాల్లో హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే.. అలాంటి బిర్యానీలో ముక్కలు తక్కువగా వచ్చాయని.. బాగాలేదని యువకులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించడంతో.. వారి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన మైలార్‌దేవులపల్లి ప్రాంతంలోని దుర్గానగర్ మెఫిల్ రెస్టారెంట్‌లో జరిగింది.
రెస్టారెంట్‌కి వచ్చిన ఇద్దరు యువకులు మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని, ముక్కలు తక్కువగా వచ్చాయని హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ సిబ్బంది, యువకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహంతో హోటల్ సిబ్బంది యువకులపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సిబ్బంది దాడిలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మెఫిల్ హోటల్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియోట్ చేసినందుకు 70(సి) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు లాక్‌డౌన్ సమయంలో రహస్యంగా వెనుక నుండి మైఫిల్ నిర్వాహకులు రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారని మైఫిల్‌పై కేసులు నమోదు చేశారు.
Also Read: