అప్పటివరకు ఆనందాల హోలీ హోరు.. అంతలోనే బాత్రూంలో విగతజీవులుగా మారిన భార్యభర్తలు

స్నానానికి వెళ్లిన దంపతులిద్దరూ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో వారి పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని పిలిచి విషయం చెప్పారు శారు పోస్ట్‌మార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 

అప్పటివరకు ఆనందాల హోలీ హోరు.. అంతలోనే బాత్రూంలో విగతజీవులుగా మారిన భార్యభర్తలు
Holi
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 09, 2023 | 9:51 PM

హోలీ సందర్భంగా సరదాగా ఆడిపాడిన దంపతులిద్దరూ బాత్‌రూమ్‌కు వెళ్లి ఊహించని రీతిలో మృత్యువాతపడ్డారు. హోలీ ఆడిన దంపతులిద్దరూ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వారి పిల్లలు ఆందోళనపడ్డారు. తల్లిదండ్రులు ఎంతకీ బయటకు రావటం లేదంటూ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని పిలిచారు. ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్ పట్టణంలోని అగ్రసేన్ మార్కెట్ ప్రాంతంలో హోలీ ఆడి తమ ఇంటి బాత్‌రూమ్‌లో కలిసి స్నానానికి వెళ్లి దంపతులు మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు. దంపతులను దీప్కా గోయల్ (40), అతని భార్య శిల్పి (36)గా పోలీసులు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో హోలీ రంగులు కడుక్కోవడానికి దంపతులు వెళ్లారని పోలీసులు తెలిపారు.

స్నానానికి వెళ్లిన దంపతులిద్దరూ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో వారి పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. తలుపులు పగులగొట్టినట్టుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) రవికుమార్ తెలిపారు. వారు ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా వారిని పరీక్షించిన వైద్యులు.. దంపతులిద్దరూ అప్పటికే మృతిచెందినట్టుగా చెప్పారు. హోలీ రోజున జరిగిన మరో సంఘటనలో, మధ్యాహ్నం మోడీనగర్‌లో వేడుకల్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు 30 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద గుండెపోటుతో మరణించాడు.

మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..