AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేక్కడి అన్యాయం..! బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళపై బీజేపీ ఎంపీ ఫైర్‌.. నోటికి వచ్చినట్టుగా తిట్ల పురాణం..!

సదరు బీజేపీ ఎంపీపై కామెంట్ల రూపంలో దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదేక్కడి అన్యాయం..! బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళపై బీజేపీ ఎంపీ ఫైర్‌.. నోటికి వచ్చినట్టుగా తిట్ల పురాణం..!
Wearing Bindi
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2023 | 6:57 PM

Share

మహిళా దినోత్సవం రోజునే మరో మహిళకు షాకింగ్‌ ఘటన ఎదురైంది. మహిళా దినోత్సవం రోజున ఒక మహిళ పట్ల బీజేపీ ఎంపీ ఒకరు అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అందరి ముందు అవమానించాడు ఆ ఎంపీ. ఎగతాళి చేశాడు. ఇష్టమొచ్చినట్టు ఆమెపై నోరు పారేసుకున్నాడు. ఇంతకీ ఆ మహిళ చేసిన తప్పల్లా నుదుటిన బొట్టు పెట్టుకోకపోవడం. అంతే ఆమెను చూసిన సదరు ఎంపీ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బొట్టెందుకు పెట్టుకోలేదు, కామన్ సెన్స్ లేదా? అంటూ ఆ మహిళా వ్యాపారిపై బీజేపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్నాటకలోని కోలార్ జిల్లాలోని చన్నైహ మందిరాలో మహిళా దినోత్సవం రోజున బీజేపీ ఎంపీ మునిస్వామి షాపింగ్ మార్కెట్‌ను ప్రారంభించాడు. ఆ సందర్భంగా ఒక స్టాల్‌లో కూర్చున్న మహిళను ఎంపి పలకరించారు. నీ పేరంటని ఆమెను ప్రశ్నించగా సుజాత అని ఆమె బదులిచ్చింది. నుదట కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ఆమెను ఎంపి ప్రశ్నించారు. నీ స్టాల్‌కు వైష్ణవి అని ఎందుకు పేరు పెట్టుకున్నావు..వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకో..నీ భర్త బతికే ఉన్నాడా లేదా.. ఎవరైనా డబ్బులిస్తే చాలు వేరే మతంలోకి మీరు మారిపోతుంటారు..అంటూ ఎంపి ముని స్వామి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు బొట్టు పెట్టుకో. కామన్ సెన్స్ లేదు. అని ఆ మహిళ మీద అరిచి పక్కనున్న మరో మహిళతో.. చెబుతూ..హే ఆ మహిళకు బొట్టు ఇవ్వు అని కోపంగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిజెపి ఎంపి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ ఎంపీ మహిళపై నోరు పారేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజనులు మండిపడుతున్నారు. సదరు బీజేపీ ఎంపీపై కామెంట్ల రూపంలో దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!
ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది..
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
మీరు చికెన్ ప్రియులా?ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే మీ బాడీ షెడ్డుకే..!
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది..
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
భక్తులకు గుడ్‌న్యూస్..అత్యాధునిక హంగులతో యాద్రాద్రి రైల్వేస్టేషన్
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..