BJP Vs BRS: ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు.. బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్‌స్కామ్‌కి వ్యతిరేకంగా కమల దళం..
లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ ఢిల్లీ యూనిట్ ధర్నా చేస్తోంది. దీన్ దయాల్ మార్గ్‌లోని ఆంధ్ర స్కూల్ దగ్గర బీజేపీ నేతల ధర్నా నిర్వహించనున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద దీక్ష కోసం..
ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే, లిక్కర్ స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ ఢిల్లీ యూనిట్ ధర్నా చేస్తోంది. దీన్ దయాల్ మార్గ్‌లోని ఆంధ్ర స్కూల్ దగ్గర బీజేపీ నేతల ధర్నా నిర్వహించనున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద దీక్ష కోసం ముందుగానే అనుమతి కోరిన జాగృతి నేతలు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. ధర్నా కోసం బీజేపీ నుంచి దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద స్థలాన్ని కుదించుకోవాలని భారత జాగృతిని ఢిల్లీ పోలీసులు కోరారు.
కవితతో సహా బీఆర్ఎస్ నేతల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముందుగా అనుమతించినట్లు జంతర్‌మంతర్‌లోనే యధావిధిగా కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నేతల ధర్నా వేదిక మార్పు.. దీన్ దయాల్ మార్జ్ లోని ఆంధ్ర స్కూలు ముందు ప్రాంతంలో లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బిజెపి నేతల ధర్నా చేయనున్నారు.
మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తోంది. నిరసన దీక్షలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఇతర ముఖ్య నాయకులు కూర్చోనున్నారు. రాష్ట్రంలో పెరిగిన మధ్యం, బెల్ట్ షాప్స్‌కు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నారు. మహిళ ఘోస- బీజేపీ బరోసా పేరుతో ఈ దీక్ష చేస్తోంది తెలంగాణ బీజేపీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం