AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Video: ఓర్నీ.. వీళ్లకేమైందిరా బాబు..! హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ ఇదేం ఏడుపు.. వేదికపైనే వెక్కి వెక్కి ఏడుస్తున్న వధూవరులు.. !

పైగా వధువు కూడా ఏడుస్తూనే వరుడిని ఓదార్చడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Wedding Video: ఓర్నీ.. వీళ్లకేమైందిరా బాబు..! హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ ఇదేం ఏడుపు.. వేదికపైనే వెక్కి వెక్కి ఏడుస్తున్న వధూవరులు.. !
Wedding Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 09, 2023 | 3:22 PM

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో..చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు కోసం అందరూ ఎదురుచూస్తుంటారు.. పెళ్లి ముహూర్తం ఖరారైనప్పటి నుంచి మనసు వెయ్యి కలలతో నిండిపోతుంది. సాధారణంగా వివాహం అంటే సంతోషకరమైన, సందడి వాతావరణం నెలకొంటుంది. చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ఇల్లంతా పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఎటు చూసినా నవ్వులే విరభూస్తాయి. వధూవరుల ముఖాల్లో పట్టరాని సంతోషం కనిపిస్తుంది.. అయితే ఇక్కడ ఓ పెళ్లిలో వధూవరులు మాత్రం పెళ్లి వేదికపైనే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది. వివాహ వేడుకలు ముగించుకుని రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం మేరకు.. వధూవరులిద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలా కాలం ప్రేమ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. తను ప్రేమించిన యువతి తనకు దక్కిందనే ఆనందంతో వరుడు భావోద్వేగానికి లోనయ్యాడు. వరుడిని చూసి వధువు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మొదట వరుడి కళ్లలో నీళ్లు రావడం వీడియోలో కనిపిస్తుంది.. కానీ, ఏం జరుగుతోందని అడగడంతో పెళ్లికూతురు కూడా ఏడవడం మొదలుపెట్టింది. పైగా వధువు కూడా ఏడుస్తూనే వరుడిని ఓదార్చడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు భిన్నమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..