AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: హాయిగా డ్యాన్స్ చేస్తున్న నెమలిపై హఠాత్తుగా దాడిచేసిన పులి.. అంతలోనే ఊహించని ట్విస్ట్!

పులి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతున్నాయి. అయితే అందమైన నెమలిపై పులి దాడి చేసిన వీడియోని చాలా అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు నెమలిపై పులి దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. చివరికి ఏం జరిగిందో చూస్తే గానీ నమ్మలేరు.

Watch: హాయిగా డ్యాన్స్ చేస్తున్న నెమలిపై హఠాత్తుగా దాడిచేసిన పులి.. అంతలోనే ఊహించని ట్విస్ట్!
Tiger Attack On Peacock
Jyothi Gadda
|

Updated on: Mar 08, 2023 | 7:50 PM

Share

ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమలి డ్యాన్స్‌ చేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో కదా..! అలాంటి దృశ్యం కంటపడితే ఎలాంటి వారైనా సరే నెమలి అందానికి, పురివిప్పు ఆడుతున్న వయ్యారికి ఫిదా అవ్వాల్సిందే. పురివిప్పిన నెమలిని ఎంత చూసినా కూడా తనివి తీరకుండానే ఉంటుంది. దాని అందాన్ని అలాగే చూస్తుండి పోవాలనిపిస్తుంది. అలాంటి అందమైన నెమలిపై దాడి చేయాలని ఎవరూ అనుకోరు. ఇది మనుషులకు వర్తిస్తుంది కానీ, జంతువులకు కాదు. మరీ ముఖ్యంగా అడవికి రాజైన పెద్దపులికి ఎవరూ అడ్డుకాదు. అందమైన నెమలైన, భారీ ఏనుగైనా సరే దాని కంటపడిందా పంజావేసి ప్రాణం తీయాల్సిందే. ఆకలిగొన్న పులికి మనిషి అయినా, జంతువు అయినా లేదంటే పక్షి అయినా సరే.. దానికి ఎరగా మారిపోవాల్సిందే. అలాంటి పులి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతున్నాయి. జంతువులపై పులులు దాడి చేసే వీడియోలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే అందమైన నెమలిపై పులి దాడి చేసిన వీడియోని చాలా అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు నెమలిపై పులి దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. చివరికి ఏం జరిగిందో చూస్తే గానీ నమ్మలేరు.

నెమలిపై పులి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని నెమళ్లు అడవిలో వాటంతట అవే తిరుగుతున్నాయి. ఎలాంటి భయం, బెరుకులేకుండా నెమళ్లు అన్నీ ఒకచోట చేరి డ్యాన్స్‌ చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. అంతలోనే ఊహించని షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఎట్నుంచి వచ్చిందో తెలియదు గానీ, హఠాత్తుగా వచ్చింది ఒక పెద్దపులి. పురి విప్పినాట్యం చేస్తున్న నెమలిపై పంజా విసిరేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సీన్‌లో ఊహించని ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది.

ఇవి కూడా చదవండి

ఇదే మంచి సమయమని భావించిన పులి ఒక్కసారిగా పొదల్లోంచి బయటకు వచ్చింది. నాట్యం చేస్తున్న నెమలిని అందుకునేలోపుగా మిగతా నెమళ్లు అలర్ట్‌ చేశారు..అప్పుడు అన్ని నెమళ్ళు మేల్కొంటాయి. ఒక్కసారే నెమళన్నీ రెక్కలు విప్పుకుని గాల్లోకి ఎగిరిపోయాయి. నన్నేమీ చేయలేవు పులీ నువ్వు అన్నట్టుగా చిన్న నెమళ్లు పెద్ద నెమలిని అనుసరిస్తూ ఎగిరిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 81 వేలకు పైగా లైక్స్, 2.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..