Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy Controversy: నెట్టింట ‘హిందూ ఫోబిక్ స్విగ్గీ’ యాష్‌టాగ్ ట్రెండ్.. డెలివరీ సంస్థపై నెటిజన్ల ఆగ్రహం.. కారణం ఏమిటంటే..?

స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వివాదానికి దారి తీయడమే కాక.. అటు సామన్యులు, ఇటు నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతున్నారు. అంతేకాక..

Swiggy Controversy: నెట్టింట ‘హిందూ ఫోబిక్ స్విగ్గీ’ యాష్‌టాగ్ ట్రెండ్.. డెలివరీ సంస్థపై నెటిజన్ల ఆగ్రహం.. కారణం ఏమిటంటే..?
Swiggy Controversial Bill Board
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 08, 2023 | 7:11 PM

ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కారణంగా ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఆ నేపథ్యంలోనే కమర్షియల్ కంపెనీలు కూడా తమ ప్రకటనలను సోషల్ మీడియా ద్వారానే చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వైరల్ అవుతుంది. లేదు లేదు నిజానికి ఆ ప్రకటన వివాదంగా మారిందని చెప్పుకోవడమే సరైన పదం అవుతుంది. అవును ఇటీవల స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వివాదానికి దారి తీయడమే కాక.. అటు సామన్యులు, ఇటు నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతున్నారు. అంతేకాక #HinduPhobicSwiggy అనే యాష్‌టాగ్‌ను ట్రెండ్ చేస్తూ స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తం చుస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్విగ్గీ ఏర్పాటు చేసిన వివాదాస్పద బిల్‌బోర్డ్ ప్రకటనపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. అంతేకాక నెటిజన్లు మండిపడుతున్నారు. హోలీ రోజున ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. స్విగ్గీ పెట్టిన బిల్‌బోర్డ్‌లో రెండు గుడ్లు ఉన్నాయి. ఇంకా దాని పక్కన ‘ఆమ్లెట్; సన్నీ సైడ్-అప్; కిసీ కే సర్ పర్. #BuraMatKhelo. ఇన్‌స్టామార్ట్‌లో హోలీ సరుకులు పొందండి’ అని రాసి ఉంది. ఈ ప్రకటనతోనే అసలు వివాదం మొదలైంది. నెటిజన్లు స్విగ్గీపై మండిపడుతూ.. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా హోలీని జరుపుకుంటారని, అందుకు స్విగ్గీ అనుమతి అవసరం లేదన్నారు. ఒక నెటిజన్ స్విగ్గీని ట్యాగ్ చేసి ‘ఈద్ సందర్భంగా ముస్లింలు మేకలను వధించడం మానుకోవాలని లేదా క్రిస్మస్ సందర్భంగా చెట్లను నరకవద్దని క్రైస్తవులను కోరుతూ మీరు అదే బిల్‌బోర్డ్‌ను పెట్టగలరా..? మీ హిందూ ఫోబియాను మా పండుగల నుంచి దూరంగా ఉంచండి, హిందువులు కోరుకున్న విధంగా హోలీని జరుపుకుందాంవ’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా మరోవైపు SCKON వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ.. ‘స్విగ్గీ శాఖాహారులకు నాన్ వెజ్ వస్తువులను పంపుతుంది. గతంలో వెజ్ ఆర్డర్ చేసిన వారికి  నాన్-వెజ్ వస్తువులను పంపిందన్న ఆరోపణలు ఉన్నాయి’ అన్నారు.  రాధారామన్ దాస్ ట్వీట్ చేస్తూ, ‘హోలీ సందర్భంగా హిందువులకు జ్ఞానాన్ని అందించడానికి స్విగ్గీ ప్రచారం ప్రారంభించింది. #BuraMatKhelo హ్యాష్‌ట్యాగ్‌తో భారీ ప్రకటన ఇచ్చింది. అదే కంపెనీ శాఖాహారులు, శాఖాహార వస్తువులను ఆర్డర్ చేసిన వారి కస్టమర్లలో కొంతమందికి నాన్-వెజ్ వస్తువులను పంపడంలో కూడా ప్రసిద్ధి చెందింద’న్నారు.

ఆల్ ఇండియా సాధు సమాజ్ సభ్యుడు, కచ్ సంత్ సమాజ్ మాజీ అధ్యక్షుడు యోగి దేవ్‌నాథ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ ప్రకటనపై స్విగ్గీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవ్‌నాథ్ ట్వీట్ చేస్తూ, ‘స్విగ్గీ హిందువుల పండుగలపై వివాదాస్పద ప్రకటనలు సరైంది కాదు. మీ హోలీ రీల్,  బిల్‌బోర్డ్ హోలీ ప్రకటన తప్పుడు అవగాహన సృష్టిస్తోంది. మీరు క్షమాపణలు చెప్పాలి.  సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాల’న్నారు.

ఇదే క్రమంలో శివసేన నేత రమేష్ సోలంకి ట్వీట్ చేస్తూ, “లక్షలాది మంది జరుపుకునే పండుగ పట్ల స్విగ్గీ అగౌరవంగా మాట్లాడుతుంది. ఇతర హిందూయేతర పండుగలపై అలాంటి సమాచారం ఎందుకు లేదు? ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకు స్విగ్గీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి. ఇటీవల స్విగ్గీ ప్రకటన ప్రచారంపై కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు మండిపడగా, మరికొందరు ఈ ప్రకటనకు మద్దతుపలుకుతున్నారు. ఓ నెటిజన్  “ఒకరి తలపై గుడ్లు పగలగొట్టడం హోలీలో భాగమా?  స్విగ్గీ ప్రకటనలో హోలీ కోసం ఒకరి తలపై గుడ్లు పగలగొట్టవద్దని ప్రజలను కోరుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏవిధంగా చెడు?”  అని స్విగ్గీకి మద్దతుగా నిలిచారు. అయితే చాలా మంది నెటిజన్లు స్విగ్గీ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తూ ఫొటోలు పెడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి