కోటగిరి అడవుల్లో ఏనుగుల బీభత్సం.. కారుపై దాడికి యత్నించిన గజరాజు.. ఏం జరిగిందంటే..
కోటగిరి జలపాతం సమీపంలోని కుంజపనై అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. ఈ వన్యప్రాణులు రాత్రి పూట ఆహారం, నీరు వెతుక్కుంటూ అడవి నుంచి బయటకు వచ్చి కోటగిరి రోడ్డు దాటడం సర్వసాధారణంగా మారిపోయింది.
తమిళనాడులో అడవి ఏనుగుల దాడులు తరచుగా నమోదవుతున్నాయి. తాజాగా కోటగిరి కొండ రహదారిపై వెళ్తున్న కారుపై ఒక అడవి ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. భయాందోళనకు గురైన కారు డ్రైవర్ అడవి ఏనుగు బారి నుంచి తప్పించుకునేందుకు కారును రివర్స్‌లో నడిపాడు. కానీ, అప్పటికే ఆ ఏనుగు కారును సమీపించింది. తొండంతో కారుపై దాడికి యత్నించింది. దాంతో కారు ముందు భాగంగా స్వల్పంగా ధ్వంసమైంది. అయినప్పటికీ కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహించాడు. ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ఏనుగు వెంటపడుతున్నప్పటికీ కారును రివర్స్‌లో వేగంగా నడిపించాడు. రివర్స్ లోనే ఏనుగుకు అందనంత దూరం వరకు ప్రయాణించి తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తూ కారు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. కారులో ఉన్నవారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. వాహనంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఇదంతా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. దీంతో కోటగిరి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ రోడ్డు మీద నుంచి ఏనుగు వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది.
ఇక్కడి మెట్టుపాళయంలోని కోటగిరి జలపాతం సమీపంలోని కుంజపనై అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. ఈ వన్యప్రాణులు రాత్రి పూట ఆహారం, నీరు వెతుక్కుంటూ అడవి నుంచి బయటకు వచ్చి కోటగిరి రోడ్డు దాటడం సర్వసాధారణంగా మారిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..