MLC Kavitha: ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా మారింది. ఎల్లుండి ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని భావిస్తున్న కవిత.. ఈడీ విచారణకు మరో రోజు హాజరుకావాలని యోచిన్నట్లు సమాచారం.

MLC Kavitha: ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ పొలిటికల్‌ అప్‌డేట్స్‌
MLC Kavitha reached Delhi
Follow us

|

Updated on: Mar 08, 2023 | 9:45 PM

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే..గురువారం విచారణకు రావాలని సూచించారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. శుక్రవారం ఢిల్లీలో జంతర్​మంతర్​ వద్ద మహిళా రిజర్వేషన్లపై ధర్నాకు కవిత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఢిల్లీ బయలు దేరే ముందు ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై న్యాయవాదులతో చర్చించారు. ఈడీ విచారణకు మరో రోజు హాజరుకావాలని కల్వకుంట్ల కవిత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలావుంటే, తెలంగాణ రాజకీయాల్ని షేక్‌ చేస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఇప్పటికి ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. సౌత్‌ గ్రూప్‌, నార్త్ గ్రూప్ అంటూ వీళ్లు ఢిల్లీని పంచేసుకుని లిక్కర్‌ బిజినెస్‌ రన్ ఎలా చేశారో పలు ఛార్జ్‌షీట్‌లలో CBI, ED స్పష్టంగా చెప్పాయి. ఈ సౌత్ గ్రూప్‌లో కీలకమైన వ్యక్తులు ఎవరికి బినామీలు అనేదానిపై ఫోకస్‌ పెట్టిన ED.. మొత్తం కూపీ లాగుతోంది.

MLC కవితను కూడా విచారణకు పిలిచారు. ఈడీ ఛార్జిషీట్‌ ప్రకారం ఈ స్కామ్‌ ఎన్ని వందల కోట్లు.. ఎవరి నుంచి ఎవరికి, ఎప్పుడు ఎలా మనీ ట్రాన్స్‌ఫర్లు జరిగాయి అనే దానిపై ఇప్పటికే ED ఓ అంచనాకు వచ్చింది. నిజానిజాలు నిర్థారించుకునేందుకు విచారణలో స్పీడ్‌ పెంచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం