KTR: మోడీ అదానీకి దోచిపెడుతున్నారు.. దొంగ డబ్బుతో ప్రభుత్వాలను కూల్చుతున్నారు.. మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏనుగుల్లు గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు.

KTR: మోడీ అదానీకి దోచిపెడుతున్నారు.. దొంగ డబ్బుతో ప్రభుత్వాలను కూల్చుతున్నారు.. మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
Minister Ktr, Pm Modi
Follow us
Basha Shek

|

Updated on: Mar 08, 2023 | 9:54 PM

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏనుగుల్లు గ్రామంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫౌండేషన్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు సొంతూరు ఏనుగల్లులో తొలి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం నిర్వహించారు. మొత్తం మూడు రోజులపాటు నిర్వహించే ఈ శిబిరంలో పలు రకాల వైద్యచికిత్సలు, టెస్టులు నిర్వహిస్తారు. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో ప్రతినెలలో రెండు శిబిరాలు మండల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో జరిగిన మహిళా సాధికారత సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రధాని మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. వన్‌ నేషన్‌- వన్‌ ఫ్రెండ్ పేరుతో కొత్త స్కీమ్‌ తెచ్చారని ఆరోపించారు..మొత్తం సొమ్మునంతా అదానీకి దోచిపెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ దొంగ డబ్బుుతోనే ఎమ్మెల్యేలను కొంటూ..ప్రభుత్వాలను కూల్చుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియమైన ప్రధాని కాదు…పిరమైన ప్రధాని అంటూ ఛలోక్తులు విసిరారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ తొర్రూరులో మోడల్‌ మార్కెట్‌, యతిరాజారావ్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో డాక్టర్‌ ప్రీతి కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అక్కడి నుంచి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌చేసి కేసు విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ