AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ ఎంత మధురం..! రెస్టారెంట్‌లో చిల్‌ అవుతోన్న వృద్ధ దంపతులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటి వరకు 6 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ జంట ప్రేమను ప్రజలు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. రెస్టారెంట్‌లో కూర్చుని బీర్‌ తాగుతున్న జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రేమ ఎంత మధురం..! రెస్టారెంట్‌లో చిల్‌ అవుతోన్న వృద్ధ దంపతులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Elderly Couple
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2023 | 7:23 PM

Share

ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ చాలా అరుదు. ఎక్కడ చూసినా ఒత్తిడి, డబ్బు సంపాదించాలనే ఆరాటం, విలాసవంతమైన జీవితం కోసం తహతహలాడే వ్యక్తులే కనిపిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది సహనం కోల్పోతున్నారు. పరస్పర అంకిత భావమూ కనిపించటం లేదు. ఈ కారణంగా, పెళ్లయిన ఆరునెలలకే అనేక జంటలు విడిపోతున్నాయి. ప్రేమ జంటలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక్కడ ప్రేమ కంటే ఇతర విషయాలు చాలా ముఖ్యమైనవి. రోజురోజుకు కోర్టుకు వస్తున్న విడాకుల సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అనుకూలత తగ్గుతుంది. ఇది మేం చెప్పడం లేదు. ఇది అనేక గణాంకాల ద్వారా రుజువు చేయబడింది. ఇప్పటి తరానికి ప్రేమ ప్రాముఖ్యత తెలియదని కాదు. అయినప్పటికీ నేటికీ స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమించే జంటలు కూడా ఉన్నాయి. అయితే గతంలో కంటే ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనడంలో సందేహం లేదు. వివిధ ఎంపికలు, టెక్నాలజీ, సోషల్ నెట్‌వర్క్, జీవనశైలి (లైఫ్‌స్టైల్) అన్నీ ప్రస్తుత ప్రజలను మార్చేశాయి. ఆ రోజుల్లో ఎవరికైనా మనసుని అప్పగిస్తే వారితో జీవితాంతం సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరించేవారు. ప్రేమించిన వారికి దొంగతనంగా ఉత్తరాలు రాసి బహుమతులు ఇస్తుంటే ప్రేమలోని ఆనందాన్ని అనుభవించేవారు. ఇప్పటికీ అందమైన ప్రేమలేఖలు రాసుకునే వృద్ధ జంటలు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ జంట కూడా..

వృద్ధ దంపతులు ప్రేమతో చేయి చేయి కలిపి నడవడం చూడ ముచ్చటగా ఉంది. వారి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో వారి ముఖకవళికలను బట్టి చెప్పవచ్చు. తన భాగస్వామికి ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేని మనసువారిది. పార్కుల్లో, ఆసుపత్రుల్లో ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న వృద్ధ జంటలను మీరు తరచుగా చూస్తుంటారు. ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేయబడింది. ఓ హోటల్‌లో ఓ జంట బీరు తాగుతున్న వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఇవి కూడా చదవండి

ది ప్రివీ పిక్చర్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన ప్రేమజంటకు సంబంధించిన వీడియో షేర్ చేయబడింది. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో తీసిన వీడియో ఇది. ఇది ఒక వృద్ధ దంపతులకు చెందిన వీడియో. వీడియోలో ఇద్దరూ చేతిలో బీరు పట్టుకుని ఉత్సాహంగా సిప్ చేస్తున్నారు. వీడియో క్రింద నిజమైన ప్రేమ అని క్యాప్షన్‌లో రాసి ఉంది. చాలా ఏళ్ల తర్వాత జీవితంలో ఎన్నింటినో కలిసి ఎదుర్కొన్న ఓ జంట ఒకచోట కలిసి కూర్చుని బీరు షేర్‌ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటి వరకు 6 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ జంట ప్రేమను ప్రజలు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. రెస్టారెంట్‌లో కూర్చుని బీర్‌ తాగుతున్న జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..