మహిళా జడ్జీకే తప్పని వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్

కోర్టు చాంబర్‌లో ఆమెకు డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు సీసీటీవీ కెమెరాలో 20 ఏళ్ల లోని వ్యక్తి కనిపించినట్టు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు.

మహిళా జడ్జీకే తప్పని వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్
Blackmail
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 09, 2023 | 3:41 PM

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కానీ, మహిళా సాధికారత పక్కన పెడితే, కనీస రక్షణ కూడా లేకుండా పోతుంది. సాధారణ మహిళలే కాదు, ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలకు మృగాళ్ల వేధింపులు తప్పటం లేదు. ఏకంగా ఒక మహిళ జడ్జీనే వేధించాడు ఓ దుండగుడు. మహిళా జడ్జి సోషల్ మీడియా ప్రొఫైల్ నుండి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసి కోర్టులోని ఆమె ఛాంబర్‌తో పాటు ఆమె నివాసానికి కూడా పంపాడు దుండగుడు. మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేయటం బాధిత మహిళా జడ్జీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళా న్యాయమూర్తిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, న్యాయమూర్తి ఫోటోలు ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి డౌన్‌లోడ్ చేసినట్టుగా నిర్ధారించారు. ఆపై ఆమె ఫోటోలను ఎడిట్ చేసి కోర్టులోని ఆమె ఛాంబర్‌తో పాటు ఆమె నివాసానికి పంపారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 7వ తేదీన తన స్టెనోగ్రాఫర్‌కు ఓ వ్యక్తి వచ్చి పార్సిల్ డెలివరీ అందించాడని, అది స్కూల్‌లోని తన పిల్లల నుంచి వచ్చిందని చెప్పాడని జడ్జీ పోలీసులకు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. అతని పేరు ఏమిటని స్టెనోగ్రాఫర్ అడగ్గానే అక్కడి నుంచి ఆ నిందితుడు వెళ్లిపోయాడని వివరించారు. ఆ పార్సిల్‌లో కొన్ని స్వీట్లు ఉన్నాయని, ఆ జడ్జీకి చెందిన మార్ఫింగ్ చేసిన ఫొటోలూ ఉన్నాయని తెలిపారు. అలాగే, ఆ పార్సిల్ కవర్‌లో ఓ లెటర్ కూడా ఉన్నది. తనకు రూ. 20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని బెదిరింపు లేఖలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రూ. 20 లక్ష లతో రెడీగా ఉండాలని, లేదంటే ఆమెను, ఆమె కుటుంబాన్ని స్పాయిల్ చేస్తానని బెదిరించినట్టు ఆ లేఖ పేర్కొంది. సమయం, స్థలాన్ని త్వరలోనే చెబుతానని తెలిపింది. ఇలాంటి వాటితోటే మరో పార్సిల్ వచ్చింది. ఇది 20 రోజుల తర్వాత ఆమె ఇంటికే వచ్చేసింది. అప్పుడు ఆ న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోర్టు చాంబర్‌లో ఆమెకు డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు సీసీటీవీ కెమెరాలో 20 ఏళ్ల లోని వ్యక్తి కనిపించినట్టు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!