Watch Video: ఆకాశంలో చక్కర్లు కొట్టిన వింత వస్తువు.. ఏలియన్స్ భూమిపైకి వచ్చాయా.?
గ్రహాంతరవాసులు.. ఈ టాపిక్ ఎప్పుడు విన్నా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఈ విశాల విశ్వంలో మనిషి ఒంటరి కాదని, ఇతర గ్రహాలపై కూడా జీవి ఉనికి ఉందని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు...

గ్రహాంతరవాసులు.. ఈ టాపిక్ ఎప్పుడు విన్నా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఈ విశాల విశ్వంలో మనిషి ఒంటరి కాదని, ఇతర గ్రహాలపై కూడా జీవి ఉనికి ఉందని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఎంతో మంది ఈ విషాయన్ని చాలా సార్లు ప్రస్తావించారు. అంతేకాదు ఏలియన్స్ మనుషులతో నేరుగా కలిసే రోజులు కూడా దగ్గరల్లోనే ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఇదిలా ఉంటే అడపాదడపా ఆకాశంలో కనిపించే కొన్ని మిస్టర్ వస్తువులు ఏలియన్స్ ఉనికి సాక్ష్యంగా నిలుస్తుంటాయి.
యూఎఫ్‌ఓల పేరుతో ఆకాశంలో వస్తువులు కనిపించిన సందర్భాలు చూశే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఆకాశంలో కాంతితో వెలుగుతోన్న ఓ వస్తువు ప్రయణిస్తుండడానికి కొందరు భూమిపై నుంచి గమనించారు. ఇంకేముంది వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొని రికార్డ్ చేసేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.




What is this? You always wonder when gazing into the sky… An innocent plane flying past? Or something else?…. pic.twitter.com/tzcwqHLkRq
— Wow Terrifying (@WowTerrifying) March 8, 2023
ఈ వీడియోలో కనిపిస్తున్న వస్తువు ముమ్మాటికీ గ్రహాంతరవాసులకు చెందిన యూఎఫ్‌ఓ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాసేపు వెలుగుతూ కనిపించిన వస్తువు ఒక్కసారిగా మాయం కావడంతో అసలు అదేంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రకాల బెలూన్స్ గాల్లో ఎగురుతూ కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇవి వాతావరణ మార్పులు గమనించేందుకు గాల్లోకి పంపించిన బెలూన్ అని అధికారులు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..