AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పానీపూరి స్టాల్ నడుపుతున్న బీటెక్‌ యువతి.. వీడియో చూస్తే సెల్యూట్‌ చేయాల్సిందే..!

అందుకే ఆమె పానీ పూరీ స్టాల్ కోసం ఆరోగ్యకరమైన పూరీలను సిద్ధం చేస్తుంది. ఆమె తన స్టాల్‌కి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్‌లను జోడించి వాటిని ఆరోగ్యవంతంగా మార్చాలని కోరుకుంటుంది.

Viral Video: పానీపూరి స్టాల్ నడుపుతున్న బీటెక్‌ యువతి.. వీడియో చూస్తే సెల్యూట్‌ చేయాల్సిందే..!
Btech Pani Puri
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2023 | 7:55 PM

Share

చాలా మంది తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని కలలు కంటారు. వారిలో కొందరు చిన్న వయస్సులోనే ఆ కలలను సాకారం చేసుకుంటారు. అనుకున్న వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభిస్తారు. అలాంటి యువ వ్యాపారవేత్తలలో 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ కూడా తమ స్థానం నిలబెట్టుకున్నారు. బీటెక్ పానీ పూరీ వలీగా ప్రసిద్ధి చెందారు.

ఇటీవల, ఉపాధ్యాయ్ నటించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అయ్యింది. @are_you_hungry007 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వీడియో షేర్ చేయబడింది. క్లిప్‌లో ఉపాధ్యాయ్ తన స్టాల్‌ని ప్రారంభించిన స్టాల్‌లో ఆమె అందిస్తున్న ఆహారం గురించి వివరిస్తున్నారు. 21 ఏండ్ల తాప్సి ఉపాధ్యాయ్ బీటెక్ పానీపూరి వాలిగా పేరొందిన తీరును ఆర్ యూ హంగ్రీ అనే ఇన్‌స్టాగ్రాం పేజ్ నెటిజ‌న్లను కట్టిపడేస్తుంది. ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 50 ల‌క్ష‌ల వ్యూస్ రాబ‌ట్టింది. మహిళగా తాను ఎదుర్కొనే పోరాటాలను కూడా ఆమె ప్రస్తావించారు. చదువు పూర్తయ్యాక పానీ పూరీలు ఎందుకు అమ్ముతున్నావని చాలా మంది తనను అడిగేవారని, ఓ మహిళ వీధిలో ఉండడం సురక్షితం కాదని కొందరు తనను ఇంటికి వెళ్లమని కూడా సలహా ఇచ్చారని కూడా ఆమె చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఉపాధ్యాయ్ బిటెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఆమె లక్ష్యం. అందుకే ఆమె పానీ పూరీ స్టాల్ కోసం ఆరోగ్యకరమైన పూరీలను సిద్ధం చేస్తుంది. ఆమె తన స్టాల్‌కి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్‌లను జోడించి వాటిని ఆరోగ్యవంతంగా మార్చాలని కోరుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..