Sukhwinder Singh Sukhu: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుక్కు..
అనేక నాటకీయ పరిణామాల మధ్య హిమాచల్ ప్రదేశ్ సీఎం క్యాండిటేట్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుక్కు పగ్గాలు చేపట్టబోతున్నారు.
అనేక నాటకీయ పరిణామాల మధ్య హిమాచల్ ప్రదేశ్ సీఎం క్యాండిటేట్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుక్కు పగ్గాలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో సీఎల్పీ సమావేశంలో సుక్కు పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. సుఖ్విందర్ సుక్కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. నౌదాన్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సుఖ్విందర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది.
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. తీవ్ర తర్జనభర్జనల మధ్య సుఖ్విందర్ వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. సీఎల్పీ సమావేశం తరువాత ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
పీసీసీ ప్రెసిడెంట్ ప్రతిభాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికి సీఎం పగ్గాలు సుక్కుకే దక్కబోతున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా సుఖ్విందర్‌కు మద్దతు ప్రకటించారు. విక్రమాదిత్యతో పాటు ముఖేశ్ అగ్నిహోత్రికి డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశముంది.
ప్రతిభాసింగ్‌ను సీఎం చేయాలని ఆమె వర్గీయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. హైకమాండ్ ప్రతినిధులు బస చేసిన ఒబెరాయ్ హోటల్ బయట ఆందోళన చేపట్టారు.
హిమాచల్ సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ దూతలు భూపేష్ బాగేల్, భూపేందర్‌సింగ్ హుడా , రాజీవ్ శుక్లా సిమ్లాకు వచ్చారు.