AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘న్యాయపరంగా పోరాటం చేస్తాం’.. నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..

ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్‌ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

'న్యాయపరంగా పోరాటం చేస్తాం'.. నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: May 01, 2024 | 3:23 PM

Share

ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్‌ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో ఇవాళ విచారణకు రాలేమని వివరణ ఇచ్చింది పీసీసీ లీగల్‌ సెల్‌. సీఎంకు ఇచ్చిన నోటుసులపై హాజరయ్యేందుకు నాలుగువారాల గడువును కోరినట్లు తెలిపారు సీఎం రేవంత్ తరఫు న్యాయవాది సౌమ్య గుప్తా.

దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ప్రస్తుతం ఐఎఫ్ఎస్ఓ ఢిల్లీ పొలీసుల ముందు హాజర్యయ్యేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. దీనికి కారణం అన్ని రాష్ట్రాల్లో సీఎం రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టు కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తాలని నిర్ణయించుకున్నారు. అందుకే తగిన గడువు కోరినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్‎కు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం అమిత్ షా చేసిన ఎన్నికల ప్రచారంలోని వీడియోగా చెబుతున్నారు పోలీసులు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు సీఎం రేవంత్‎తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను విచారించాలని నిర్ణయించింది.

లీగల్ సెల్ అడ్వొకేట్..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు