UGC NET 2024 Postponed: యూజీసీ – నెట్‌ 2024 జూన్‌ సెషన్‌ పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్టీయే

యూజీసీ నెట్ జూలై సెషన్‌ 2024 పరీక్ష తేదీని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ మారుస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత ప్రకటించిన తేదీ ప్రకారం.. జూన్‌ 16న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష కూడా ఉంది. దీంతో ఒకటే రోజున రెండు పరీక్షలు ఉండటంతో యూజీసీ నెట్‌ పరీక్షను జూన్‌ 18కు రీషెడ్యూల్‌ చేసినట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్‌కుమార్‌..

UGC NET 2024 Postponed: యూజీసీ - నెట్‌ 2024 జూన్‌ సెషన్‌ పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్టీయే
UGC NET 2024 Postponed
Follow us
Srilakshmi C

|

Updated on: May 01, 2024 | 4:00 PM

న్యూఢిల్లీ, మే 1: యూజీసీ నెట్ జూలై సెషన్‌ 2024 పరీక్ష తేదీని వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ మారుస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత ప్రకటించిన తేదీ ప్రకారం.. జూన్‌ 16న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష కూడా ఉంది. దీంతో ఒకటే రోజున రెండు పరీక్షలు ఉండటంతో యూజీసీ నెట్‌ పరీక్షను జూన్‌ 18కు రీషెడ్యూల్‌ చేసినట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్‌కుమార్‌ ప్రకటించారు. నెట్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్ధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ మేరకు పరీక్ష తేదీని మార్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయన తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.

కాగా దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ప్రతీయేట ఈ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పెన్ను, పేపర్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. యూజీసీ నెట్‌ 2024 పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా యూజీసీ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.