Rupali Ganguly: రాజకీయాల్లోకి ‘అనుపమ’ ఫేమ్.. బీజేపీలో చేరిన రూపాలీ గంగూలీ

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖుల రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. 'అనుపమ' ఫేమ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఆమె బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. రూపాలీతో పాటు సినీ దర్శకుడు అమయ్ జోషి కూడా రాజకీయాల్లోకి వచ్చారు.

Rupali Ganguly: రాజకీయాల్లోకి 'అనుపమ' ఫేమ్.. బీజేపీలో చేరిన రూపాలీ గంగూలీ
Anupama Fame Rupali Ganguly
Follow us
Balaraju Goud

|

Updated on: May 01, 2024 | 1:24 PM

2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖుల రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. ‘అనుపమ’ ఫేమ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఆమె బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. రూపాలీతో పాటు సినీ దర్శకుడు అమయ్ జోషి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత నటి రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మహాయజ్ఞాన్ని చూసినప్పుడు, నేను కూడా ఇందులో పాలుపంచుకోవాలని అనిపించింది. నేను ఏది చేసినా సరైనది మరియు మంచిగా ఉండాలి. అనుకుంటున్నట్లు రూపాలీ తెలిపారు.

రూపాలీ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఆమె చాలా సార్లు దీని గురించి మాట్లాడారు. కొంతకాలం క్రితం రూపాలీ ప్రధాని మోదీని కూడా కలిశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ క్యాంపెయిన్‌లో భాగమయ్యారు రూపాలీ. ప్రస్తుతం ‘అనుపమ’ సీరియల్‌ నటిస్తున్న రూపాలీ, టీవీ ఇండస్ట్రీని శాసిస్తోంది. ఈ షోలో ఆమె అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రూపాలీకి బుల్లితెరపై పాపులారిటీ విపరీతంగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 మిలియన్లు అంటే 20 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. రూపాలీ సినిమా దర్శకుడు అనిల్ గంగూలీ కూతురు. నటిగా 7 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించింది. తన తండ్రి నిర్మించిన ‘సాహెబ్‌’లో తొలిసారిగా నటించాడు. కానీ రూపాలికి 2003లో వచ్చిన ‘సంజీవని: ఎ మెడికల్ బూన్’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

రూపాలీ’బిగ్ బాస్’ సీజన్ 1లో కూడా పాల్గొన్నారు. రూపాలి ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ వంటి హిట్ షోలలో కూడా పాల్గొన్నారు. 2013లో ‘పర్వారిష్’ సీరియల్ చేసిన తర్వాత 7 ఏళ్ల విరామం తీసుకున్నారు. ఆ తర్వాత రూపాలి ‘అనుపమ’తో టీవీ ప్రపంచంలోకి తిరిగి వచ్చింది. వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే, రూపాలీ వ్యాపారవేత్త అశ్విన్ కె వర్మను 2013లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రూపాలి చలనచిత్రం, టీవీ పరిశ్రమతో పాటు థియేటర్‌లో ఒక భాగం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…