CM Father: బ్యాలెట్లు వాడండి..లేదంటే నా చావుకు అనుమతినివ్వండి.. రాష్ట్రపతికి సిఎం తండ్రి లేఖ..

Chhattisgarh CM Father: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడండి.. లేదంటేనా చావుకు అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌..

CM Father: బ్యాలెట్లు వాడండి..లేదంటే నా చావుకు అనుమతినివ్వండి.. రాష్ట్రపతికి సిఎం తండ్రి లేఖ..
Chhattisgarh Cm's Father
Follow us

|

Updated on: Jan 12, 2022 | 12:37 PM

Chhattisgarh CM Father: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడండి.. లేదంటేనా చావుకు అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ తండ్రి నందకుమార్‌ బఘేల్‌. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు బదులు బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించాలని లేఖలో కోరారు. ఈవీఎంల ద్వారా అవకతవకలకు ఎక్కువ ఆస్కారముందని, వాటిని నమ్మలేమని ఎలక్ట్రానిక్‌ యంత్రాపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని వివరించారు. అందుకే మళ్లీ పాత పద్ధతిలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరారు. అలా జరగని పక్షంలో తన మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

పౌరుల రాజ్యాంగ హక్కులను యథేచ్ఛగా హరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు భూపేష్‌ బఘేల్‌. దేశ పౌరుల్లో భయం పెరుగుతోందని, ఇలాంటి వ్యవస్థలో తనకు బతకాలని లేదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతానని మీరు ప్రమాణం చేశారని గుర్తు చేసిన నందకుమార్.. తన రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదని, కాబట్టి తనకు మరణం తప్ప మరో మార్గం లేదని అన్నారు. జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తన మరణానికి అనుమతి ఇవ్వాలని నందకుమార్ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. కాగా, ఓటర్లను జాగృతం చేసే రాష్ట్రీయ మత్‌దాతా జాగృతి మంచ్‌కు నందకుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Also Read:  అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..