Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Passport 2022: మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ ర్యాంకులు.. భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?

Henley index world best passport 2022: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల (Passport) జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ పాస్‌పోర్ట్

Best Passport 2022: మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ ర్యాంకులు.. భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?
Passports
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2022 | 11:42 AM

Henley index world best passport 2022: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల (Passport) జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley index) 2022 జాబితా ప్రకారం ఇండియా 83వ ర్యాంకును సొంతం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే.. 7 స్థానాలను ఎగబాకింది. గతడాది 90వ స్థానంలో నిలిచిన భారత్‌.. (India) ఈసారి మరింత మెరుగుపడింది. దీని సహాయంతో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా 60 దేశాలను సందర్శించవచ్చు. కాగా.. టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో (Best Passport 2022) అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందిస్తుంది.

కాగా.. జపాన్, సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు కలిగిన దేశాలుగా టాప్-ర్యాంకింగ్ లో నిలిచాయి. జపాన్, సింగపూర్‌లకు రికార్డు స్థాయి ప్రయాణ స్వేచ్ఛ ఉంది. తాత్కాలిక కోవిడ్-సంబంధిత పరిమితులను పరిగణనలోకి తీసుకోకుండా రెండు ఆసియా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీసా లేకుండా 192 గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇండెక్స్‌లో దిగువన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ (166 వ) స్థానంలో నిలిచింది. ఈ మేరకు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్లోబల్‌ సంస్థ ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌’ పేరుతో జాబితాను విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ఎన్ని దేశాలను సందర్శించవచ్చో కూడా వెల్లడిస్తుంది.

2022 ఉత్తమ పాస్‌పోర్ట్‌లు: 1. జపాన్, సింగపూర్ (192 గమ్యస్థానాలు) 2. జర్మనీ, దక్షిణ కొరియా (190) 3. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ (189) 4. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ (188) 5. ఐర్లాండ్, పోర్చుగల్ (187) 6. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ (186) 7. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (185) 8. పోలాండ్, హంగరీ (183) 9. లిథువేనియా, స్లోవేకియా (182) 10. ఎస్టోనియా, లాట్వియా, స్లోవేనియా (181)

చివర్లో నిలిచిన పాస్‌పోర్ట్‌లు ప్రపంచంలోని అనేక దేశాలు 40 కంటే తక్కువ దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి. వాటిలో ఈ దేశాలు ఉన్నాయి. 104. ఉత్తర కొరియా (39 గమ్యస్థానాలు) 105. నేపాల్ మరియు పాలస్తీనియన్ భూభాగాలు (37) 106. సోమాలియా (34) 107. యెమెన్ (33) 108. పాకిస్తాన్ (31) 109. సిరియా (29) 110. ఇరాక్ (28) 111. ఆఫ్ఘనిస్తాన్ (26)

Also Read:

PM Security Breach: పంజాబ్‌ పర్యటనలో ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..