ఐసీఐసీఐ బ్యాంక్‌ స్కాం‌: చందాకొచ్చర్ భర్త అరెస్ట్‌

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త

  • Tv9 Telugu
  • Publish Date - 7:10 am, Tue, 8 September 20
ఐసీఐసీఐ బ్యాంక్‌ స్కాం‌: చందాకొచ్చర్ భర్త అరెస్ట్‌

ICICI bank scam: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్‌ కొచ్చర్‌ అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఆయనను సెషన్స్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా వీడియో కాన్‌ గ్రూప్‌కు రూ.1875కోట్ల మేర రుణాలను మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో చందా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్‌ని తప్పించారు. ఇక ఈ కేసులో పలుమార్లు దీపక్‌ని విచారించిన ఈడీ.. సోమవారం మధ్యాహ్నం నుంచి మరోసారి విచారించారు. ఈ స్కాంకు సంబంధించి ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక చందాకొచ్చర్‌ హయాంలో గుజరాత్‌లోని స్టెరింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్‌ స్టీల్ గ్రూప్‌కి ఐసీఐసీఐ రుణాలు మంజూరు చేయగా.. అందులోనూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఈడీ దర్యాప్తను చేయనుంది.

Read More:

చిన్నారుల పౌష్టికాహారంలో పాలను చేర్చండి..

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..