AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైళ్లు,స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం నేరం.. భారీ జరిమానా..!

రైల్వేశాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం చేస్తే నేరంగా పరిగణించి వెంటనే జరిమానా లేదా జైలు శిక్ష విధించనుంది.

రైళ్లు,స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం నేరం.. భారీ జరిమానా..!
Ravi Kiran
|

Updated on: Sep 08, 2020 | 9:21 AM

Share

రైల్వేశాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం చేస్తే నేరంగా పరిగణించి వెంటనే జరిమానా లేదా జైలు శిక్ష విధించనుంది. రైల్వే చట్టం, 1989 ప్రకారం శిక్షలను హేతుబద్ధీకరించడానికి.. రైళ్లలో లేదా స్టేషన్లలో యాచనను నివారించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 144 (2) ప్రకారం ఇకపై రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేస్తే జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా విధించనున్నారు. అటు  ధూమపానం కోసం, చట్టంలోని సెక్షన్ 167ను సవరించాలని కోరింది. తోటి ప్రయాణీకుడు అభ్యంతరం వ్యక్తం చేస్తే, రైలు కంపార్ట్మెంట్లలో ఏ వ్యక్తి కూడా పొగ త్రాగకూడదు. రైళ్లలో పొగ తాగితే రూ. 100 వరకు జరిమానా విధిస్తారు. (Begging on Trains, Penalise Smokers Only with a Fine)

Also Read: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి పాత చట్టాలను సవరించడానికి కేంద్రం తీసుకున్న చర్యల్లో ఈ ప్రతిపాదనలు కూడా ఒక భాగమని రైల్వే శాఖ చెబుతోంది. అంతేకాకుండా రైల్వే బోర్డు ప్రతిపాదించిన సవరణలపై సూచనలను కూడా ఆహ్వానించింది. అటు జూన్‌లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించడం, ఫుట్‌బోర్డులపై ప్రయాణం చేయడం వంటి చిన్న నేరాలకు జైలు శిక్ష విధించాలని రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే ఆయా చట్టాలను సవరించిన తర్వాత.. నేరస్థులకు జరిమానా మాత్రమే విధించబడుతుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.