AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netaji Subhas Chandra Bose: నేతాజీ బతికే ఉన్నారా..? చనిపోయారా? సమాధానం చెప్పాలి.. కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

ఎన్నో మిస్టరీలను ఛేదిస్తున్నాం. కానీ నేతాజీ మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నాం. ఇందులో అడ్డంకులు ఏంటి? అడ్డుకుంటున్నది ఎవరు?

Netaji Subhas Chandra Bose: నేతాజీ బతికే ఉన్నారా..? చనిపోయారా? సమాధానం చెప్పాలి.. కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
Netaji Sibhaschandra Bose
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2021 | 9:55 AM

Share

Calcutta High Court: ఎన్నో మిస్టరీలను ఛేదిస్తున్నాం. కానీ నేతాజీ మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నాం. ఇందులో అడ్డంకులు ఏంటి? అడ్డుకుంటున్నది ఎవరు? ఈ దేశానికి తెలియాలి. నేతాజీ చనిపోయారా..? మరి ఎక్కడ..? నేతాజీ అదృశ్యం కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన తర్వాత అఫిడవిట్ దాఖలు చేయాలని కలకత్తా హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం ఈ అఫిడవిట్‌ను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది.

నేతాజీ బతికే ఉన్నారా.. లేదా చనిపోయారా? సోమవారం కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అంటూ దాఖలైన ఈ కేసులో తమకు సమాధానం కావాలని ప్రధాన న్యాయమూర్తి డివిజన్‌ ​​బెంచ్‌ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎనిమిది వారాల గడువు ఇచ్చింది.

కలకత్తా హైకోర్టు వర్గాల సమాచారం ప్రకారం.. భారతదేశం గర్వించదగ్గ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారా.. చనిపోయారా.. అనే ప్రశ్నకు ఏ ప్రభుత్వం కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయిందని హరేన్ బాగ్చి ప్రశ్నించారు.

హరేన్ బాగ్చీ పిటిషన్‌తో పాటు, భారత కరెన్సీలో నేతాజీ చిత్రాన్ని ఉపయోగించవచ్చా.. లేదా అనే విషయాన్ని కూడా కోర్టు పరిశీలించాలని కోరారు. కేంద్రం తన వైఖరిని వెంటనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ ఆదేశించారు. ఎనిమిది వారాల్లోగా దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం ఉందో కేంద్రం అఫిడవిట్‌తో తెలియచేయాలని సూచించారు.

నేతాజీ అదృశ్యం మిస్టరీపై అనేక విచారణ కమిషన్లు ఏర్పాటయ్యాయి. చివరి విచారణ కమిషన్ ముఖర్జీ కమిషన్. తైహోకూర్ విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు కోల్పోయారని గతంలో ఖోస్లా కమిషన్, షానవాజ్ కమిషన్ పేర్కొన్నాయి. కానీ ముఖర్జీ కమిషన్ ఆ డిమాండ్‌ను అడ్డుకుంది. మనోజ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్, సుభాష్ చంద్రబోస్‌గా చెప్పబడుతున్న రెంకోజీ ఆలయ అస్థికలు వాస్తవానికి జపాన్ సైనికుడికి చెందినవని పేర్కొంది. విమానం కూలిపోయిన రోజు తైపీలో ఏ విమానమూ కూలిపోలేదని తైపీ ప్రభుత్వం తెలిపింది.

1999లో, నేతాజీ అదృశ్యంపై విచారణ జరిపిన ముఖర్జీ కమిషన్ వివిధ దేశాలకు చెందిన వందలాది ఫైళ్లను పరిశీలించి జపాన్, రష్యా, తైవాన్‌లను సందర్శించింది. అయితే, అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ పరిశీలనలను గుర్తించలేదు. నవంబర్ 8, 2005న, ముఖర్జీ కమిషన్ ఈ విషయంపై ఒక నివేదికను సమర్పించింది. 2006 మే 16న పార్లమెంటులో జరిగిన చర్చ తర్వాత ఇది తిరస్కరించబడింది.

అవును. 1941 ఆగస్ట్‌ 18న నేతాజీ విమాన ప్రమాదంలో మరణిస్తే.. వారం రోజుల తర్వాత ఆయన సోవియట్‌లోకి ఎలా వెళ్లారు? నేతాజీ మరణం మిస్టరీపై దేశాన్ని ఉలిక్కిపడేలా చేసే చారిత్రక ఆధారం ఇది. ఎవరికీ సాధ్యం కాని అంశాన్ని పూరబీ రాయ్‌ ఛేదించారు.

నేతాజీ ఎప్పుడూ అనుకునేవాడు.. ‘ఒక మనిషి ఆదర్శం కోసం చనిపోవచ్చు. కానీ ఆ ఆదర్శం ఆయన మరణానంతరం కూడా వేలాది మందిలో నిలిచి ఉండాలి. నేతాజీ జీవితంలోని ఈ అధ్యాయం నేటికీ రహస్యంగానే ఉంది. హరేన్ బాగ్చి లాంటి చాలా మంది ఈ మిస్టరీని కనీసం ఈసారి అయినా బయటపెట్టాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం