AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Temple: అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు.. ప్రధాని మోడీకి ఆహ్వానం..

దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో ప్రతి పట్టణంలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ పోస్టర్‌లను ఏర్పాటు చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. జనవరి 15 మరియు 24 మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీని తాము సమయాన్ని కోరినట్లు చెప్పారు. 

Ayodhya Temple: అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు.. ప్రధాని మోడీకి ఆహ్వానం..
Ayodhya Ram Temple
Surya Kala
|

Updated on: Jul 25, 2023 | 10:45 AM

Share

రామ జన్మ భూమి అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆలయం సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది 2024లో జనవరి 15 నుంచి 24 లోగా ఆలయంలో శ్రీ రామయ్య విగ్రహ సంప్రోక్షణ జరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది.

దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో ప్రతి పట్టణంలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ పోస్టర్‌లను ఏర్పాటు చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. జనవరి 15 మరియు 24 మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీని తాము సమయాన్ని కోరినట్లు చెప్పారు.

వాల్మీకి రామాయణం, శ్రీమద్ భాగవత పారాయణం : చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరిలో శ్రీముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు చంపత్ రాయ్ తెలిపారు. రాముని ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడానికి అనేక ఆచారాలు జరుగుతున్నాయి. చంపత్ రాయ్ ప్రకారం తీర్థ క్షేత్ర భవన్ రామ్‌కోట్‌లో ఋగ్వేదం, శ్యామవేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద మంత్రాల సమర్పణలు జరుగుతున్నాయి. వాల్మీకి రామాయణం, శ్రీమద్ భాగవత పారాయణం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేవాలయంలోని అన్ని స్తంభాలపై విగ్రహాల ఏర్పాటు : చంపత్ రాయ్ ఆలయంలోని తలుపులన్నీ చెక్కలతో నిర్మిస్తున్నామని చెప్పారు. తలపులపై చెక్కుతున్న శిల్పాలను  ఒకసారి పరిశీలించారు. దేవాలయంలోని అన్ని స్తంభాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గర్భాలయ సింహం ద్వారం వద్ద రెండు సింహాలు, రెండు ఏనుగులు, హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాల నిర్మాణాన్ని ఏ రాతితో నిర్మిస్తారనే విషయంపై  సమావేశంలో చర్చ జరిగింది. ఈ విగ్రహాలను ఆలయంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాల వలనే ఒకే రాతితో తయారు చేయించనున్నామని పేర్కొన్నారు.

చంపత్ రాయ్ పార్కోట్‌లో కూడా దేవాలయాలు నిర్మించాలని.. ఎక్కడ ఏ పరిమాణంలో విగ్రహాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చ సాగుతోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారని ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..