AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొద్దుపోయి ఇంటికొచ్చిన రైతు.. పంటచేనులోని సీసీ కెమెరా చెక్ చేయగా..

పొలం నుంచి ఆ రైతు అప్పుడే ఇంటికొచ్చాడు. ఇక తన పంటచేనులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఓసారి చెక్ చేయగా.. దెబ్బకు కంగుతిన్నాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇలా..

Telangana: పొద్దుపోయి ఇంటికొచ్చిన రైతు.. పంటచేనులోని సీసీ కెమెరా చెక్ చేయగా..
Telangana
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 12:19 PM

Share

నిర్మల్ జిల్లాను చిరుత పులుల సంచారం భయపెడుతోంది. ఒకే రోజు రెండు చిరుతలు జనం కంటపడటంతో ఆ భయం రెట్టింపు అయింది. ఖానాపూర్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా నుంచి తర్లపాడు వెళ్లే మార్గంలో శనివారం రాత్రి అడవి నుంచి గ్రామంలోకి వెళుతూ ఓ చిరుత ప్రయాణికుల కంట పడింది. తర్లపాడు నుంచి ఖానాపూర్ వైపు వెళుతున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రోడ్డు దాటుతున్న చిరుతను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో ఖానాపూర్ మండలంలోని దిలావర్ఫూర్ శివారులోని బొక్కలగుట్ట సమీపంలోని ఓ పంటపొలంలో మరో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. పంటచేనులో రైతు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో చిరుత పులి కదలికలు రికార్డ్ అయ్యాయి.

అది గుర్తించిన రైతు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించాడు. మండలంలో ఒకేరోజు రెండు చిరుతలు కెమెరాలకు చిక్కడంతో సోషల్ మీడియోలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. చిరుతల సంచారం ఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. దీంతో ఖానాపూర్ మండలం సమీప ప్రాంతాల ప్రజలను తర్లపాడు, దిలావర్పర్ గ్రామాల రైతులు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అటవీశాఖ. తాజాగా సాగిన జంతు గణనలో గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగినట్టు సమాచారం. పెంబి అడవి ప్రాంతంలో మాంసాహార జంతువుల సంఖ్య రెట్టింపు అయినట్టు అటవిశాఖ ప్రాథమికంగా గుర్తించింది.

ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
క్రికెట్ దేవుడికే రీప్లేస్‌మెంటా? సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
అప్పుడు భయపెట్టింది.. ఇప్పుడు గ్లామర్‏తో చంపేస్తున్న దెయ్యం పిల్ల
అప్పుడు భయపెట్టింది.. ఇప్పుడు గ్లామర్‏తో చంపేస్తున్న దెయ్యం పిల్ల