Tollywood: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?
నటుడు అజయ్ ఘోష్ తన సినీ కెరీర్‌లో ఎదుర్కున్న కష్టాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మాదాపూర్‌లో పెయింట్ పనికి వెళ్లడం, కృష్ణ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో ఆకలి బాధలు లాంటి ఎన్నో సంఘటనల గురించి ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా..

ప్రతిభకు గుర్తింపు అంత సులభంగా రాదు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు దాటుకుని నిలబడిన వారే సినీ ఇండస్ట్రీలో విజయాలను అందుకుంటారు. అలాంటి ప్రస్థానమే నటుడు అజయ్ ఘోష్ ది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని కొన్ని సంఘటనల గురించి వివరించారు. సినీ ఇండస్ట్రీలోని తన అనుభవాలను పంచుకున్నారు. అవకాశాల కోసం ఎంతో మంది ఎదురుచూసే ఈ ఇండస్ట్రీలో ఎంతటి బాధలు ఉంటాయో తన జీవితం ఒక ఉదాహరణ అని ఆయన వెల్లడించారు.
అవకాశాలు లేని సమయంలో తినడానికి తిండిలేక, రూము అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు అజయ్ ఘోష్ తెలిపారు. కొన్నిసార్లు అన్నం లేక పస్తులున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. యూసుఫ్ గూడలోని సవేరా ఫంక్షన్ హాల్ వద్ద జరిగే పెళ్ళిళ్ళ భోజనాల సమయానికి వెళ్లి తినేసే రోజులవి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పని లేని సమయంలో, సీరియల్స్ చేసిన తర్వాత కూడా, యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బస్తీ నుంచి మాదాపూర్‌కు వెళ్లి పెయింటింగ్ పనులు చేసుకునేవాడినని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. వంద రూపాయలతో కృష్ణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి, దారి మధ్యలో చిట్ట్యాల వద్ద బండి ఆగిపోయినప్పుడు, ఒక ముద్ద అన్నం కోసం పడిన ఆకలి బాధను వివరించారు. ఆ సమయంలో ఒక బేల్దార్ పెద్దాయన ఇచ్చిన గోంగూరతో అన్నం ముద్ద తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఆ రాత్రి హైదరాబాద్ చేరుకున్నాక, మధురానగర్ స్టూడియో దాకా నడుచుకుంటూ వెళ్లిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు.
గుర్తింపు కోసం కాకుండా, తనలోని నటుడిని నిరూపించుకోవాలనే తపనతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఎస్.వి. రంగారావు, రావు గోపాల్ రావు, నాగభూషణం, ఆర్. నాగేశ్వరరావు లాంటి గొప్ప నటుల వారసత్వాన్ని కొనసాగిస్తూ విభిన్న పాత్రలు పోషించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో పూరీ జగన్నాథ్ తనకు విలన్‌గా గుర్తింపునిచ్చారని, ఆయనను తన గాడ్ ఫాదర్ గా భావిస్తానని తెలిపారు. అయితే, రంగస్థలం సినిమాలో తాను పోషించిన శేషు నాయుడు పాత్ర తనను నటుడిగా మరింత గుర్తింపును ఇచ్చిందని వివరించారు. ఈ పాత్రకు వచ్చిన అప్రిసియేషన్ తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, అది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తనకొచ్చిన గుర్తింపును కాపాడుకోవాలనే ఆలోచన తనకు లేదని, మంచి పాత్రలు లభిస్తే చాలని అజయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. బాపు, పూరీ జగన్నాథ్, సుకుమార్, వెట్రిమారన్ వంటి గొప్ప దర్శకులతో పనిచేయడం ద్వారా నటుడిగా, మనిషిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన తెలిపారు. రాజమౌళి బాహుబలి 2లో నటించినా, సీన్స్ నిడివి కారణంగా తొలగించారని పేర్కొన్నారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
