ఇంట్లో ఒప్పుకోలేదు.. చచ్చిపోతాను అని బెదిరించా..! అసలు విషయం బయట పెట్టిన ఫైమా
జబర్దస్త్ ఫైమా తన వినోద రంగ ప్రవేశం, ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జబర్దస్త్ షో లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఫైమా. మేల్ కమెడియన్స్ ను డామినేట్ చేస్తూ కామెడీ చేసి ఆకట్టుకుంది ఫైమా ..

ఫైమా.. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యింది ఫైమా. జబర్దస్త్ షో వల్ల చాలా మంది పాపులర్ అయ్యారు. ఈ కామెడీ షోకు మంది ప్రేక్షాదరణ లభించింది. ఎంతో మంది జబర్దస్త్ షో వల్ల గుర్తింపు పొందారు.. అలాగే సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఈ కామెడీ షో ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే హైపర్ ఆది కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే వేణు, ధనరాజ్ దర్శకులుగా మారి సినిమాలు తీస్తున్నారు. వీరితోపాటు ఇంకొంతమంది కూడా సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ షోకు కూడావెళ్తున్నారు. ఇక ఈ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు.
అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..
తన కామెడీ టైమింగ్ తో పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఫైమా. ఆమె స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. కానీ ఇప్పుడు ఫైమా హడావిడి పెద్దగా కనిపించడం లేదు. జబర్దస్త్ వల్ల వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. నిజాయితీగా టాస్క్‌కు ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఫైమా పెళ్లిపీటలు ఎక్కనుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫైమా ఆసక్తికర విషయాలను పంచుకుంది.
గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..
తనకు పటాస్ షోలో అవకాశం వచ్చినప్పుడు తన ఫ్యామిలీ ఏమన్నారో తెలిపింది. ఫైమా మాట్లాడుతూ.. పటాస్ షోలోకి వెళ్లెవరకూ మా ఇంట్లో టీవీ లేదు.. ఒకసారి మా కాలేజ్ స్టూడెంట్స్ ను పటాస్ షోకు తీసుకెళ్లారు.. ఆడియన్స్ గా తీసుకువెళ్ళడానికి ఒకొక్కరి దగ్గర రూ.500 వసూల్ చేశారు. అయితే నా దగ్గర ఆసమయంలో డబ్బులు లేకపోవడంతో మా ఫ్రెండ్ దగ్గర రూ. 500 అప్పు చేసి వెళ్ళాను. ఆతర్వాత నా జోక్స్ ను ప్రోమో కట్ చేసి వదిలారు.. ప్రోమోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో నేను ఆ షోకి వెళ్తాను మా అమ్మను అడిగాను.. కానీ హైదరాబాద్ వెళ్లాలి వొద్దు అని అన్నారు. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని నేను రెండు రోజులు అన్నం తినలేదు. మా నాన్నను నేను చాలా ఇష్టం.. నేను ఏడిస్తే తట్టుకోలేడు. ఆయన వేరే దేశంలో ఉండేవాడు. ఆయన కూడా ఒప్పుకోలేదు. దాంతో నేను ఓ రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని చచ్చిపోతాను అని బెదిరించా అప్పుడు ఒప్పుకుంది మా అమ్మ అని తెలిపింది ఫైమా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




