Sundeep Kishan: ఆ సినిమా చేసుంటే నా కెరీర్ వేరేలా ఉండేది.. హీరో సందీప్ కిషన్..
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కొన్నాళ్లుగా తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ హీరో.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే తన కెరీర్ లో ఎన్నో సినిమాలు వదిలేశానని.. ఆ తర్వాత ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. అలాగే తన సినీ ప్రయాణంలోని ఒడిదుడుకులను పంచుకున్నారు.

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను అనుకున్న విషయాలు తప్పాయని అన్నారు. తాను చేయనని చెప్పిన ఎన్నో కథలు బ్లాక్ బస్టర్‌లుగా మారాయని.. ముందుగా ఎక్కడికి పోతావ్ చిన్నవాడా వంటి చిత్రం రిజెక్ట్ చేశానని.. ఆ తర్వాత అదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని అన్నారు. ఈ సినిమా కథ టైగర్ సినిమా సమయంలో ఆనంద్ చెప్పినప్పుడు, దానిలో కొన్ని మార్పులు ఉండేవని, టైగర్పై తనకు నమ్మకం ఉన్నందున, విడుదల తర్వాత చూద్దామని వేచి ఉన్నానని వివరించారు. ఈలోగా ఆనంద్ నిఖిల్‌కి ఆ కథను చెప్పి కమిట్ అయ్యారని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
ఒకసారి కథను నమ్మి, దర్శకుడిని ఎంచుకున్న తర్వాత, తాను కేవలం తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తానని, మిగిలిన ఎడిటింగ్ లేదా ఇతర సాంకేతిక అంశాలలో జోక్యం చేసుకోనని సందీప్ కిషన్ స్పష్టం చేశారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి రావాలనుకునే వారికి ఆయన ముఖ్యమైన సలహా ఇచ్చారు. లక్షలు, రెండు లక్షలు ఇచ్చి పాత్రలు కొనవద్దని, అలా డబ్బులు తీసుకునే నిర్మాతలు మంచి సినిమా తీయడానికి హామీ ఉండదని హెచ్చరించారు. సినీ రంగంలో విజయం సాధించడానికి ఓపిక, పట్టుదల చాలా ముఖ్యమని, విజయ్ సేతుపతి, రవితేజ వంటి వారు ఎన్నో ఏళ్ల కృషి తర్వాతే స్టార్‌లుగా ఎదిగారని గుర్తు చేశారు. అదృష్టం కన్నా ఓపిక ఉండాలని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
తేజ్ (సాయి ధరమ్ తేజ్), రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, ఆదిత్య, సుధీర్, రోహిత్, రాజ్ తరుణ్ తన స్నేహితులను అన్నారు. కృష్ణవంశీతో పనిచేయడం తనకు ఒక జీవిత పాఠం నేర్పిందని, ఆయన ఒత్తిడితో కూడిన పని వాతావరణం శారీరకంగా, మానసికంగా బలహీనపరిచినా, అది తన వ్యక్తిత్వాన్ని మార్చిందని, ఇతరులలో మంచిని మాత్రమే చూడటం నేర్చుకున్నానని చెప్పారు.జెమినీ కిరణ్ తన పట్ల తండ్రిలా నిలిచారని, ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా తనకు అండగా ఉన్నారని కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ సుంకర రన్ సినిమా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అడగకుండానే సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. తనను బెస్ట్ ఫ్రెండ్స్ అని నమ్మి చాలామంది మోసం చేశారని, కేవలం తమ సంబంధాల కోసం తనను ఉపయోగించుకున్నారని సందీప్ కిషన్ బాధగా తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
