ఊహకందని దారుణం.. కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు.. కారణం ఇదే..
Kanyakumari News: మురళీధరన్ శైలజ దంపతులు.. ఈ అన్యోన్య దంపతులకు ఏకైక సంతానం జీవా.. జీవా వయస్సు ఏడేళ్లు.. కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు.. ఐటి ఉద్యోగం చేస్తున్న మురళీధరన్ కుటుంభం ఆర్ధికంగా కూడా బాగానే ఉంది.

Kanyakumari News: మురళీధరన్ శైలజ దంపతులు.. ఈ అన్యోన్య దంపతులకు ఏకైక సంతానం జీవా.. జీవా వయస్సు ఏడేళ్లు.. కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు.. ఐటి ఉద్యోగం చేస్తున్న మురళీధరన్ కుటుంభం ఆర్ధికంగా కూడా బాగానే ఉంది. కన్యాకుమారిలోని ప్రైమ్ ఏరియాలో నూతన భవనం కూడా కట్టుకున్నారు మురళీధరన్ శైలజ.. మూడు నెలల క్రితమే గృహప్రవేశం కూడా జరిగింది. అంతా బాగానే ఉన్నా.. లోకం పోకడ కూడా తెలియని వయస్సులో ఉన్న కొడుకుని తల్లిదండ్రులే హత్య చేశారు.. రాత్రి పడుకునే ముందు నిద్రమాత్రలు పాలలో కలిపి తాగించారు.. ఆతర్వాత దిండుతో మొహంపై ఆదిమిపెట్టి ఊపిరి అడకుండా చేసి హత్యచేశారు. ఆతర్వాత అదే ఇంట్లో శైలజ, మురళీధరన్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చూడముచ్చటగా ఉన్న ఆ చిన్న పిల్లాడిని చంపడానికి బయటవారికే చేతులు రావు.. అలాంటిది తల్లిదండ్రులు వారి చేతులతో ఎలా చంపగలిగారు అంటూ విషయం తెలిసిన వారందరూ బాధపడ్డారు. విషయం తెలిశాక పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం బయటపడింది.
మురళీధరన్ కొడుకు జీవాకి అనారోగ్య సమస్య ఉందన్న విషయం బయటపడింది. మానసిక సమస్య ఉందని చెప్పారు. పరిష్కారం కోసం చాలామంది వైద్యులను కలిశారు తల్లిదండ్రులు.. వైద్యులు కొడుకు మానసిక పరిస్థితి జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పడంతో తల్లితండ్రులు తీసుకున్న కఠిన నిర్ణయం.. తమ తర్వాత కొడుకు పరిస్థితిని ఊహించుకుని కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది.. కొత్తగా కట్టుకున్న ఆశల సౌధం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు భవిష్యత్తు.. కొడుకుతో ఊహించుకున్న దంపతుల జీవితం.. అన్నీ ఒక్క నిర్ణయం తో ఇలా విషాదంగా మిగిలింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
