AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. ఇంకో వీడియో రిలీజ్‌ చేసిన బాధితురాలు..

MLA Arava Sridhar Controversy: అరవ లీల - ఆగని గోల ఎపిసోడ్‌ కంటిన్యూ అవుతోంది. డైలీ సీరియల్‌లా రోజుకో ట్విస్టు తీసుకుంటోంది. ఎమ్మెల్యేను హనీ ట్రాప్‌ చేశారని అరవ వర్గం ఆరోపిస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తల్లి ప్రమీల.. బాధితురాలిపై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ ఫేక్‌ అని బాధితురాలు ఖండించారు. హనీ ట్రాప్ చేసేదాన్నయితే, ఇంతకాలం ఆగేదాన్నా అంటూ ఆమె ఎదురుదాడి చేశారు.

MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. ఇంకో వీడియో రిలీజ్‌ చేసిన బాధితురాలు..
Mla Arava Sridhar
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2026 | 9:50 AM

Share

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మేటర్‌ రోజురోజుకు హీటెక్కుతోంది. ఈ విషయంలో మరో కొత్త కోణం బయటపడింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బాధితురాలు హనీ ట్రాప్ చేసిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఆమె 25 కోట్ల రూపాయల డిమాండ్‌ చేసిందని ఆరోపించారు. మరోవైపు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యానని బాధితురాలు మాయమాటలు చెప్పి, తమ దగ్గర డబ్బు వసూలు చేసినట్టు, పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఎమ్మెల్యే తల్లి ప్రమీల పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేశారు. UPSCలో సెలక్ట్ అయ్యానని చెప్పి ఫేక్ ఇంటర్వ్యూ లెటర్‌, సివిల్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ హాల్ టికెట్ బాధితురాలు చూపించిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు.

మరో వీడియో రిలీజ్‌ చేసిన బాధితురాలు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తాను హనీ ట్రాప్‌ చేస్తే.. ఏడాదిన్నర బాధ పడాల్సిన అవసరం లేదన్నారు బాధితురాలు. ఒక్క రోజులో హనీ ట్రాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయొచ్చని, తాను ఆ పని చేయలేదన్నారు ఆమె. తనకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందో, డాక్టర్లు తేలుస్తారని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు ఆమె. తనకు శ్రీధర్‌కు మధ్య జరిగిన వ్యవహారం గురించి మాట్లాడకుండా, టాపిక్‌ను జనసేన నేత నాగేంద్ర డైవర్ట్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ, బాధితురాలు మరో వీడియో రిలీజ్‌ చేశారు.

ఇంత రచ్చ జరుగుతున్నా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని బాధితురాలు ప్రశ్నించారు. తాను హనీ ట్రాప్‌ చేసి 25 కోట్ల రూపాయలు అడిగానని నిరూపించాలని, ఎమ్మెల్యే వర్గానికి ఛాలెంజ్‌ చేశారు.

అరవ లీల – ఆగని గోల కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యే ప్రత్యక్షమై మాట్లాడేదాకా… ఈ ధారావాహిక ఆగేలా లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..