దారుణం.. మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం
మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ, అదుపు లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని ఓ 28 ఏళ్ల మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం చేయండం కలకలం రేపుతోంది.

మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ, అదుపు లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని ఓ 28 ఏళ్ల మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం చేయండం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే పాకుర్ జిల్లాలోని ఆ మహిళ తన ప్రియుడితో కలిసి అండాపడా అనే ప్రాంతానికి వెళ్లింది. అలా రాత్రి పూట తన ప్రియుడితో తిరుగుతుండగా గుర్తు తెలియని దుండగులు వారిని గుర్తించారు. వారిపై దాడి చేసి ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 10 నుంచి 12 మంది దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.
ఈ దుర్ఘటన జరిగిన అనంతరం బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తన ఫిర్యాదులో ప్రేమికుడి వివరాలను చెప్పడం లేదని.. నిందితులను గుర్తించేందుకు కూడా నిరాకరిస్తుందని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేశాయి.




