ఈ గింజలు కాసిన్ని నీళ్లలో వేసి తాగారంటే..

01 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఆహారం తిన్న తర్వాత కాసిన్ని సోంపు గింజలు తింటే చక్కగా జీర్ణం అవుతుంది. ఈ గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, అరుదైన పోషకాలు ఉండటమే అందుకు కారణం

TV9 Telugu

సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్‌, విటమిన్‌ సి, ఐరన్‌, సెలెలియం, మాంగనీస్‌, క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి

TV9 Telugu

సోంపు నమలడం వల్ల లాలాజలంలో నైట్రైట్‌ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటు సాధారణంగా ఉండేలా చూస్తుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది

TV9 Telugu

సోంపు శరీరంలో ఉండే ప్రాణాంతకమైన పదార్ధాలను, అవసరం లేని ద్రవాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో మలమూత్ర నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి

TV9 Telugu

సోంపు గింజలే కాదు వీటి నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణవ్య‌వ‌స్థ స‌డ‌లించ‌బ‌డుతుంది. ఉబ్బరం త‌గ్గుతుంది

TV9 Telugu

జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, ఆమ్ల‌త్వం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు సోంపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. భారీ భోజ‌నం చేసిన త‌రువాత గుండెల్లో మంట‌, ఆమ్ల‌త్వం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తితే ఈ నీళ్లు తాగవచ్చు

TV9 Telugu

గ్లాస్ నీటిలో ఓ టీ స్పూన్ సోంపు గింజ‌లు వేసి రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి లేదా గ్లాస్ నీటిలో సోంపు గింజ‌లు వేసి బాగా మ‌రిగించినా ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

ఈ విధంగా సోంపు నీటిని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. ఆహారం జీర్ణమవడంతోపాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది