AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs 2026: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్) కింద రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

Bank Jobs 2026: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!
Central Bank Of India Recruitment
Srilakshmi C
|

Updated on: Feb 01, 2026 | 7:35 PM

Share

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్) కింద రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఫిబ్రవరి 3, 2026వ తేదీ ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

కేటగిరీ వారీగా ఖాళీలు..

  • ఫారెన్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌ 3) పోస్టుల సంఖ్య: 50
  • మార్కెటింగ్‌ ఆఫీసర్‌ 1 పోస్టుల సంఖ్య: 300

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్‌కు ఫారెక్స్ లేదా ట్రేడ్ ఫైనాన్స్‌లో బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. మార్కెటింగ్ ఆఫీసర్‌కు మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో బీఎఫ్ఎస్‌ఐ రంగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి స్కేల్ 3 పోస్టులకు 30 నుంచి 38 ఏళ్లు, స్కేల్ 1 ఖాళీలకు 23 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 3, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద జనరల్ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.175 చొప్పున చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.1,05,280, స్కేల్ 1 పోస్టులకు రూ.85,920 వరకు జీతంగా చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 20, 2026.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2026.
  • ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి లేదా మార్చి 2026లో ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేదీ: మార్చి లేదా ఏప్రిల్‌ 2026లో ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?