AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: భయ్యా.! నువ్వు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌వి.. ఇక చాలు వెళ్లి ఐపీఎల్ ఆడుకోమ్మా

భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, నిలకడ లేని ఫామ్ కారణంగా అతని అంతర్జాతీయ టీ20 కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

Sanju Samson: భయ్యా.! నువ్వు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌వి.. ఇక చాలు వెళ్లి ఐపీఎల్ ఆడుకోమ్మా
Sanju Samson
Ravi Kiran
|

Updated on: Feb 02, 2026 | 8:29 AM

Share

భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతని దారుణమైన వైఫల్యం. ఈ కీలకమైన సిరీస్‌లో సంజూ శాంసన్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లలో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. మొత్తం సిరీస్‌లో 9.2 సగటుతో కేవలం 46 పరుగులు మాత్రమే చేయడం అతని ఫామ్ లేమిని స్పష్టం చేసింది. ఈ పేలవ ప్రదర్శనతో రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టులో అతనికి చోటు దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, సంజూ శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఆటగాళ్లకు, మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లకు అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల హాఫ్ సెంచరీ, సెంచరీలతో తన సత్తాను చాటుకున్నాడు. ఇది టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా కిషన్‌కు చోటు దాదాపుగా ఖాయం చేసిందని మాజీలు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సంజూ శాంసన్ భారత టీ20 జట్టులో బెంచ్‌కే పరిమితం కావచ్చు. ప్రపంచకప్ అనంతరం అతను జట్టులో ఎంపిక కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, సంజూ శాంసన్ టీ20 అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో అతని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అతని భవిష్యత్తు ఐపీఎల్ వంటి దేశవాళీ టోర్నమెంట్‌లకే పరిమితం కావచ్చని చాలా మంది భావిస్తున్నారు.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి