AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్..! వెంటనే ఇది చేస్తే బెటర్

ఏపీలోని రైతులకు అలర్ట్. ఫిబ్రవరి చివరి వారంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశముంది. ఈ క్రమంలో రైతులు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పని చేయకపోతే డబ్బులు పొందటంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు బిగ్ అలర్ట్..  ఈ పని చేయకపోతే డబ్బులు కట్..! వెంటనే ఇది చేస్తే బెటర్
Farmers
Venkatrao Lella
|

Updated on: Feb 02, 2026 | 11:27 AM

Share

ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ-క్రాప్‌లో తమ పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించింది. అంటే పోలంలో ఏ పంట వేశామనే వివరాలు రైతులు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందేందుకు ఇది సహాయపడుతుంది. ఒకవేళ ఈ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలు పొందటంతో రైతులు ఇబ్బంది పడే అవకాశముంది. ఒక్కొసారి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నిలిపిపోవచ్చు. దీంతో రైతులందరూ ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేయించుకోవాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

ఈ-క్రాప్ తప్పనిసరి

రైతులు అందించే పథకాలన్నింటికి ఈ-క్రాప్‌తో ఏపీ ప్రభుత్వం లింక్ పెడుతోంది. అకాల పరిస్థితుల్లో పంటకు నష్టం జరిగినప్పుడు ఇచ్చే విపత్తు పరిహారంతో పాటు బీమా, రాయితీలు, సబ్సిడీలకు వంటివి పొందేందుకు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలనే నిబంధన పెట్టింది. ఒకవేళ చేయించుకోకపోతే వాటిని అందించడం లేదు. త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీంతో పీఎం కిసాన్ సాయం విడుదల చేసే రోజే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. త్వరలో కేంద్రం పీఎం కిసాన్ సాయం రూ.2 వేలు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయనుండగా.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4 వేలు జమ చేయనుంది. దీంతో ఏపీ రైతులు రూ.6 వేలు అందుకోనున్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నగదు పొందాలన్నా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచిస్తోంది.

యాప్ ద్వారా చేసుకోవడం ఎలా..?

రైతు సేవా కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్‌లోనే కాకుండా రైతులు నేరుగా మొబైల్ ద్వారా తమ పంట వివరాలు నమోదు చేయవచ్చు. ఇందుకోసం ఈ-పంట, APAIMS యాప్‌లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయ్యి యూనిక్ ఐడీని పొందవచ్చు. ఇక తమ సాగు విస్తీర్ణం, పంట, రకం వివరాలను పొందుపర్చవచ్చు. ఇక భూమి వివరాలు, సర్వే నెంబర్లను ఆధార్‌తో లింక్ చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఈ-పంట అని సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది. ఏపీ వ్యవసాయశాఖ ఈ యాప్‌ను తీసుకొచ్చింది. మీ ఆధార్, మొబైల్ నెంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అయ్యి ఓటీపీ ద్వారా పంట వివరాలను నమోదు చేయవచ్చు.

Follow Us
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో