Telangana: తెలంగాణకు కేంద్రం మరో భారీ శుభవార్త.. బడ్జెట్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్
కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసింది. దేశవ్యాప్తంగా స్కూళ్లల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. 15 వేల ల్యాబ్స్ ఏర్పాటు చేయనుండగా.. వీటిల్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయి. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లను ఇవి ఏర్పాటు కానున్నాయి.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని 15 వేల ప్రభుత్వ స్కూళ్లు, 500 కాలేజీల్లో వీటిని నెలకొల్పనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటి ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, యానిమేషన్ వంటి వాటిల్లో విద్యా్ర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో భవిష్యత్తుల్లో ఆయా రంగాల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందవచ్చు. లేక స్వయం ఉపాధి అయినా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉపాధి కల్పనలో భాగంగా విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు కేటాయింపులు
కేంద్రం ప్రకటించిన కంటెంట్ క్రియేటర్ ల్యాబుల్లో తెలంగాణకు 500 వరకు రానున్నాయి. 15 వేల ల్యాబుల్లో తెలంగాణలో 500 ఏర్పాటు చేయున్నారు. ఇక 2016లో విద్యార్థులకు 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికపై నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం గవర్నమెంట్ స్కూళ్లల్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 10 వేల టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో తెలంగాణలో 400 ల్యాబ్‌లు నెలకొల్పారు. వీటికి 2025-26 బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్‌లో రూ.3200 కోట్లు కేటాయించారు. దీంతో దేశవ్యాప్తంగా 30 వేల ల్యాబ్‌లు నెలకొల్పనున్నారు. దీంతో వీటిల్లో తెలంగాణకు పెద్ద సంఖ్యలో ల్యాబ్‌లు రానున్నాయని తెలుస్తోంది.
జిల్లాకో గర్ల్స్ హాస్టల్
విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణలోని విద్యార్థినులకు కూడా లాభం జరగనుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 45 శాతం వరకు అమ్మాయిలు చదువుకుంటున్నారు. జిల్లాలో హాస్టల్ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల వీరికి లబ్ది చేకూరనుంది. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం 33 గర్ల్స్ హాస్టళ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీని వల్ల విద్యార్థులకు సౌకర్యవంతమైన హాస్టల్ వసతి లభించనుంది. కొన్ని జిల్లాల్లో అమ్మాయిలకు హాస్టళ్లు అందుబాటులో లేవు. దీంతో వసతి సౌకర్యం కోసం ఇబ్బంది పడుతున్నారు. కాగా బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ప్రకటించింది. ఇవి మినహా బడ్జెట్ లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు జరపలేదు. దీంతో బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
