Lok Sabha Elections 2024: ‘ఇండి కూటమికి 295కు పైగా సీట్లు వస్తాయి’.. ఖర్గే నివాసంలో ముగిసిన కీలక నేతల భేటి..
ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5.30కు ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు సమావేశం సాగింది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్, డీ.రాజా, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, శరద్‌పవార్, కల్పనా సోరెన్, డీఎంకే నేత బాలు హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఎన్నికల తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.

ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5.30కు ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు సమావేశం సాగింది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్, డీ.రాజా, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, శరద్‌పవార్, కల్పనా సోరెన్, డీఎంకే నేత బాలు హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఎన్నికల తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండి కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఇండి కూటమికి 295కు పైగా సీట్లు వస్తాయన్నారు. ఇది ఎగ్జిట్ పోల్స్ సర్వే కాదని, ప్రజలు చేసిన సర్వే అన్నారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు దేశంలో విప్లవం తెస్తాయన్నారు అఖిలేశ్ యాదవ్. ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చలో పాల్గొనాలని కూడా ఇండి కూటమి నేతలు నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికలకు తుదిదశ పోలింగ్ జరుగుతున్న వేళ ఈ సమావేశం జరగడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. దీనిపై పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. కేజ్రీవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 2న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగియడంతో ఈరోజు సమావేశం నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. ఏప్రిల్ 1న ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ జూన్ 1తో ముగిసింది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు శనివారం సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగిసింది. తుది దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా NDA, ఇండి కూటమిల మధ్య హోరా హోరీగా ఈ ఎన్నికల మహా సంగ్రామం సాగింది. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ, మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








