Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections: 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? పీపుల్స్ పల్స్ పట్టాయా.. లేదా..? ఏది నిజమైంది పూర్తి వివరాలు..

Lok Sabha Election Exit Poll Results 2019: ఎగ్జిట్‌ పోల్‌.. దేశమంతా వీటి కోసం కోట్లాది కళ్లతో ఎదురు చూస్తున్నది. సో.. ఆ క్షణం రానే వచ్చింది. నిజానికి పోలింగ్ పూర్తయినవెంటనే విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఈ సారి దేశమంతా ఎన్నికలు పూర్తయితే తప్ప విడుదల చెయ్యకూడదన్న ఈసీ ఆదేశాలతో ఇవాళ చివరి విడత పోలింగ్ పూర్తయిన తర్వాతే విడుదలకానున్నాయి. అయితే ఈ ఫలితాలు ఎంత వరకు ఎగ్జాట్‌గా ఓటరు నాడిని పడతాయి... అన్న విషయంలో రకరకాల విశ్లేషణలు ఉన్నాయి.

Lok Sabha Elections: 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? పీపుల్స్ పల్స్ పట్టాయా.. లేదా..? ఏది నిజమైంది పూర్తి వివరాలు..
Exit Poll
Follow us
Ravi Panangapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 01, 2024 | 4:14 PM

ఎగ్జిట్‌ పోల్‌.. దేశమంతా వీటి కోసం కోట్లాది కళ్లతో ఎదురు చూస్తున్నది. సో.. ఆ క్షణం రానే వచ్చింది. నిజానికి పోలింగ్ పూర్తయినవెంటనే విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఈ సారి దేశమంతా ఎన్నికలు పూర్తయితే తప్ప విడుదల చెయ్యకూడదన్న ఈసీ ఆదేశాలతో ఇవాళ చివరి విడత పోలింగ్ పూర్తయిన తర్వాతే విడుదలకానున్నాయి. అయితే ఈ ఫలితాలు ఎంత వరకు ఎగ్జాట్‌గా ఓటరు నాడిని పడతాయి… అన్న విషయంలో రకరకాల విశ్లేషణలు ఉన్నాయి.

గత రెండు పార్లమెంట్ ఎన్నికల వాస్తవ ఫలితాలతో ఎగ్జిట్ పోల్స్‌ను సరిచూసినప్పుడు 2019 ఎన్నికల్లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఈ రెండు సంస్థలు వెల్లడించిన ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దాదాపు దగ్గరగా వచ్చాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ కూటమికి 339 నుంచి 365 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అలాగే యూపీఏకి 77 నుంచి 180 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. టుడేస్ చాణక్య విషయానికి వస్తే ఎన్డీఏకి సుమారు 350 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే యూపీఏకి సుమారు 95 సీట్లు రావచ్చని చెప్పింది. చివరిగా ఫలితాలు వెల్లడైన తర్వాత ఎన్డీఏకి 353 సీట్లు రాగా, యూపీఏ 91 స్థానాల్లో విజయం సాధించింది. అలా చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినప్పటికీ ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య సంస్థలు వెల్లడించిన ఎగ్టిట్ పోల్స్ మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో మే 19 సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో చాలా సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీ వైపే మొగ్గు చూపాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 20 స్థానాలకు దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి.

వాస్తవ ఫలితాలకు కాస్త దగ్గరగా ఉన్న ఎగ్జిట్ పోల్ అంచనాలను చూస్తే..

పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని చెప్పింది.

వైసీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని ఆరా మస్తాన్‌ సర్వే తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది.

టైమ్స్‌ నౌ తన ఎగ్జిట్‌ పోల్స్‌ లో వై‌సీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.

న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 13 నుంచి 14 లోక్ సభ సీట్లు వస్తాయని… టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుందని చెప్పుకొచ్చింది..

అయితే వాస్తవ ఫలితాలు ఎగ్టిజ్ పోల్స్ అంచనాలను మించి వచ్చాయనే చెప్పొచ్చు. మొత్తంగా 25 పార్లమెంట్ స్థానాలకు గాను, 22 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమయ్యింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు రావచ్చని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని చెప్పింది.

వైసీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని ఆరా మస్తాన్‌ సర్వేలో వెల్లడయ్యింది.

వైసీపీ 130 – 135, టీడీపీ 30 – 35, జనసేన పార్టీ 10 – 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కేకే సర్వే తెలిపింది.

మిషన్‌ చాణక్య తన సర్వేలో వైసీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేసింది.

అయితే ఎగ్టిట్ పోల్స్ ఏం చెప్పినా ఫలితాలు అందరి అంచనాలకు అందని రీతిలో వైసీపీకి రికార్డు స్థాయి మెజార్టీని తీసుకొచ్చాయి. ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించగా, టీడీపీ కేవలం 23 స్థానాలకు, జనసేన ఒకే ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ వైసీపీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలకు భిన్నంగానే రిజల్ట్స్ వచ్చాయి. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ.

సో.. ఇక్కడ చూస్తే కేవలం 3-4 సంస్థలు చేసిన ఎగ్టిట్ పోల్స్ మాత్రమే వాస్తవ ఫలితాలకు కాస్త దగ్గరగా కనిపించాయి తప్ప.. ఏ ఒక్కరూ ఓటరు నాడిని పూర్తి స్థాయిలో అంచనా వెయ్యలేకపోయారనే చెప్పొచ్చు.

నిజానికి తుది ఫలితాలకు ఎవరి ఎగ్జిట్‌ పోల్‌ అంచానాలు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే.. ఆ సంస్థ చేసిన సర్వే కచ్చితం అని చెప్పవచ్చు. అయితే చాలా సందర్భాల్లో తమ అంచనాలకు 60 శాతం దగ్గరగా ఫలితాలున్నా.. తాము విజయం సాధించినట్టు చాలా సంస్థలు ప్రకటించుకుంటుంటాయి.

పోలింగ్‌ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఏ సమయంలో ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించారు? ఎన్ని శాంపిల్స్‌ తీసుకున్నారు? అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు? ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్ పలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తారు. అయితే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంత మంది కొట్టి పారేస్తారు. ఎందుకంటే ఎగ్జిట్‌ పోల్స్‌కు విరుద్ధంగా కొన్ని సార్లు ఫలితాలు వెల్లడవుతుంటాయి. 2004లో ఇలాగే జరిగింది. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది.

2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..